Shahbaz Sharif : పాకిస్తాన్ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సంచలన ప్రకటన చేశారు. పీఎంగా పదవీ కోల్పోయిన మాజీ ప్రధాన మంత్రి, మాజీ పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కు భారీ బందోబస్తు కల్పించాలని ఆర్మీని ఆదేశించారు.
ఇప్పటికే ఆయనకు ప్రాణహాని తలపెట్టే ఛాన్స్ ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ కూడా బహిరంగంగా ప్రకటించారు కూడా. ఈ తరుణంలో పీఎం షరీఫ్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం కలకలం రేగింది.
ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ దేశ వ్యాప్తంగా బహిరంగ సభలలో పాల్గొంటున్నారు. తాను దిగి పోయేందుకు కుట్ర పన్నారంటూ ఆరోపిస్తున్నారు.
ప్రధానమంత్రి షరీఫ్(Shahbaz Sharif )ఆదేశాల మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ ఇమ్రన్ ఖాను కు ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలనే దానిపై సంబంధిత అధికారులకు లేఖ రాసింది.
ఈ విషయాన్ని ధ్రువీకరించారు కూడా. సదరు మంత్రిత్వ శాఖ నాలుగు ప్రావిన్సుల హోమ్ సెక్రటరీలు, ఇస్లామాబాద్ ప్రధాన కమిషనర్ కు అత్యవసర లేఖను పంపింది.
ఇమ్రాన్ ఖాన్ కు కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరింది. పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశించింది. ఆదేశాలు అమలు అయ్యేలా చూడాలని పీఎం షెహబాజ్ షరీఫ్ (Shahbaz Sharif )అంతర్గత మంత్రి రాణా సనావుల్లాను ఆదేశించారు.
ఇటీవల ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం, 2 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఖాన్ తన ప్రధాని పదవిని కోల్పోయారు. అనంతరం పెద్ద ఎత్తున మాజీ పీఎం సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
Also Read : జుకర్ బర్గ్..కమలా హరీస్ కు రష్యా షాక్