PAK vs AUS T20 : ఉత్కంఠ పోరులో ఆసిస్ హ‌వా

చివ‌రి దాకా పోరాడిన పాకిస్తాన్

PAK vs AUS T20 : పాకిస్తాన్, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన ఏకైక టీ20 మ్యాచ్ ఆద్యంతమూ ఉత్కంఠ‌ను రేపింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగింది ఈ మ్యాచ్. ఇరు జ‌ట్లు విజ‌యం కోసం పోరాడాయి. చివ‌ర‌కు గెలుపు ఆసిస్ ను వ‌రించింది.

పాకిస్తాన్ టూర్ లో ఉన్న ఆసిస్ 3 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను ఓడించింది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు టెస్టు సీరీస్ ఆసిస్ కైవ‌సం చేసుకోగా వ‌న్డే సీరీస్ ను పాకిస్తాన్ స్వంతం చేసుకుంది.

ఇక ఏకైక టీ20ని ఆస్ట్రేలియా ఎగ‌రేసుకు పోయింది. లాహోర్ వేదికగా జ‌రిగిన ఈ మ్యాచ్ లో క్రికెట్ అభిమానుల‌కు మంచి ఫీల్ క‌లిగించేలా చేసింది.

టీ20 లో ఇంత మ‌జా ఉంటుంద‌ని వారు కూడా అనుకోలేదు. చివ‌రి ఓవ‌ర్ దాకా ఇరు జ‌ట్లు విజ‌యం కోసం తీవ్రంగా పోటీ ప‌డ్డాయి. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఆస్ట్రేలియా కెప్టెన్ టాస్ గెలిచాడు.

ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ ఎప్ప‌టి లాగే దంచి కొట్ట‌డం మొద‌లు పెట్టింది.

ఆ జ‌ట్టు ఓపెన‌ర్ రిజ్వాన్ 23 ప‌రుగులు చేస్తే కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ మ‌రోసారి స‌త్తా చాటాడు.

ఏకంగా 66 ప‌రుగులు చేసి సూప‌ర్ బోణీ అందించారు. అనంత‌రం వ‌చ్చిన బ్యాట‌ర్లు ఎవ‌రూ ఆశించిన మేర ఆడ‌లేక పోయారు.

ఇక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 162 ర‌న్స్ చేసింది పాకిస్తాన్ జ‌ట్టు.

ఇక ఆసిస్ బౌల‌ర్ ఎలిస్ 4 వికెట్లు కూల్చాడు. అనంత‌రం బ‌రిలోకి దిగిన ఆసిస్ హెడ్ 26 ప‌రుగులు చేస్తే

ఆరోన్ పింఛ్ 55 ర‌న్స్ చేసి స‌త్తా చాటాడు.ఇంగ్లిస్ 24 ర‌న్స్ చేస్తే స్టొయినిస్ 23 ప‌రుగులు చేశాడు .

అనంత‌రం వెంట వెంట‌నే వికెట్లు ప‌డ‌డంతో మ్యాచ్ పాకిస్తాన్ వైపు మొగ్గింది. ఒకానొక స‌మ‌యంలో పాకిస్తాన్ గెలుపు అంచుల దాకా వెళ్లింది.

కానీ మెక్ డెర్మాట్ 22 ప‌రుగులు చేసి త‌న జ‌ట్టుకు గెలుపు అందించాడు.

Also Read : శ్రీ‌లంక స‌ర్కార్ పై క్రికెట‌ర్ల క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!