PAK vs HK Asia Cup 2022 : పాకిస్తాన్ భళా హాంకాంగ్ విలవిల
38 పరుగులకే కుప్ప కూలింది
PAK vs HK Asia Cup 2022 : యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ -2022 మెగా టోర్నీలో అద్భుత విజయాన్ని నమోదు చేసింది పాకిస్తాన్ జట్టు. లీగ్ మ్యాచ్ లో భాగంగా హాంకాంగ్ తో(PAK vs HK Asia Cup 2022) జరిగిన కీలక పోరులో ఏకంగా 156 పరుగుల తేడాతో గెలుపొందింది.
ప్రత్యర్థి జట్టును 38 పరుగులకే కట్టడి చేసింది. ఈ రిచ్ లీగ్ లో ఇంత భారీ తేడాతో సాధించడం మొదటి మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఆగస్టు 28న జరిగిన దాయాదుల పోరులో పాకిస్తాన్ ఓటమి పాలైంది భారత జట్టుతో.
హాంకాంగ్ తో జరిగిన రెండో మ్యాచ్ లో సునాయశంగా విజయం సాధించింది. టోర్నీలో టైటిల్ బరిలో నిలిచింది పాకిస్తాన్. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ ఏ కోశాన పోటీ ఇవ్వలేక పోయింది.
పాకిస్తాన్ బౌలర్ల ధాటికి బెంబేలెత్తి పోయారు. ఒకరి వెంట మరొకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.
11 మంది ఆటగాళల్లో 10 మంది ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం విశేషం. ఇక పాక్ కు చెందిన బౌలర్లలో షాదాబ్ ఖాన్ దుమ్ము రేపాడు.
అద్భుతమైన బంతులతో చుక్కలు చూపించాడు. మిస్సైల్ లాంటి బంతులను ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడ్డారు. ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు.
మహ్మద్ నవాజ్ మూడు వికెట్లు పడగొడితే నసీమ్ షా రెండు, దహినీ ఒక వికెట్ తీశాడు. ఇక ముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 రన్స్ చేసింది .
రిజ్వాన్ అద్భుతంగా ఆడాడు. 78 పరుగులు చేశాడు. ఫకర్ జమాన్ 53 రన్స్ తో ఆకట్టుకున్నాడు.
Also Read : సూర్య భాయ్ బ్యాటింగ్ సూపర్ – అఫ్రిది