PAK vs NZ 1st Test 2022 : కేన్ మామ అదుర్స్ కీవీస్ సూప‌ర్

భారీ స్కోర్ దిశ‌గా న్యూజిలాండ్

PAK vs NZ 1st Test 2022 : కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ సార‌థ్యంలోని పాకిస్తాన్ జ‌ట్టుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. పాక్ టూర్ లో భాగంగా న్యూజిలాండ్ జ‌ట్టు దుమ్ము రేపుతోంది. మాజీ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ ఏకంగా పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు(PAK vs NZ 1st Test 2022)  చూపించాడు. 150కి చేరువ‌లో ఉన్నాడు. క‌రాచీ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు భారీ స్కోర్ దిశ‌గా ప‌రుగులు తీస్తోంది కీవీస్. సోధి కూడా హాఫ్ సెంచ‌రీతో ఉన్నాడు.

పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో ఇప్ప‌టి వ‌రకు అబ్రార్ అహ్మ‌ద్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక ఆతిథ్య జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో బాబ‌ర్ ఆజ‌మ్ దంచి కొట్ట‌డంతో 438 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇక బాబ‌ర్ ఆజ‌మ్ 161 ర‌న్స్ చేస్తే అఘా స‌ల్మాన్ 103 ప‌రుగులు చేశాడు. ఇద్ద‌రూ క‌లిసి పాకిస్తాన్ కు గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ అందించారు.

నిన్న మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి కేన్ విల‌య‌మ్స‌న్ 105 ప‌రుగుల‌తో నాటౌట్ గా ఉన్నాడు. 6 వికెట్లు కోల్పోయి 440 ప‌రుగులు చేసింది. తిరిగి నాలుగో రోజు ఆట ప్రారంభం కావ‌డంతో కేన్ , సోథీ క‌లిసి మ‌రింత ధీటుగా ఆడుతున్నారు. పాకిస్తాన్ బౌలర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు న్యూజిలాండ్ జ‌ట్టులో ఓపెన‌ర్ టామ్ లాథ‌మ్ సెంచ‌రీతో దంచి కొట్టాడు.

113 ర‌న్స్ చేశాడు. మ‌రో ఓపెన‌ర్ కాన్వే 8 ప‌రుగుల తేడాతో సెంచ‌రీ మిస్ అయ్యాడు. 92 ప‌రుగుల వ‌ద్ద వెనుదిరిగాడు. మొత్తంగా టెస్టు డ్రా అయ్యే ఛాన్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. మ‌రి కీవీస్ డిక్లేర్ చేస్తుందా లేక ఆడుతుందా అన్న‌ది చూడాలి.

Also Read : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌హిళా జ‌ట్టు డిక్లేర్

Leave A Reply

Your Email Id will not be published!