PAK vs NZ 1st Test 2022 : సత్తా చాటిన బాబర్ ఆజమ్
కీవీస్ పై ఒత్తిడి పెంచిన కెప్టెన్
PAK vs NZ 1st Test 2022 : పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సత్తా చాటాడు. అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్ టూర్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో(PAK vs NZ 1st Test 2022) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఆజమ్. కీవీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. గత కొంత కాలంగా తన ఫామ్ ను కొనసాగిస్తూ వస్తున్నాడు స్కిప్పర్ బాబర్ ఆజమ్.
ఇటీవల ఇంగ్లండ్ తో ఆడిన మూడు టెస్టుల్లోనూ పాకిస్తాన్ ఓటమి పాలైంది. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు కెప్టెన్. ఈ సమయంలో పూర్తి పట్టు సాధించేలా పట్టుదలతో ఆడాడు బాబర్ ఆజమ్. ఏకంగా 161 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కీవీస్ జట్టుపై తీవ్ర ఒత్తిడి పెంచాడు.
భారీ స్కోర్ దిశగా ముందుండి నడిపించాడు నాయకుడిగా. బాబర్ సపోర్ట్ తో పాకిస్తాన్ స్కోర్ 5 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. చివరి రెండు సెషన్లలో ఆతిథ్య జట్టు సర్ఫరాజ్ వికెట్ ను మాత్రమే కోల్పోయింది. 196 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒకానొక దశలో 110 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ జట్టును బాబర్ ఆజమ్(Babar Azam) ఆదుకున్నాడు. 86 పరుగుల వద్ద సర్ఫరాజ్ ను అజాజ్ పటేల్ ఔట్ చేశాడు.
ఇదిలా ఉండగా పాకిస్తాన్ లోని కరాచీ వేదికగా తొలి టెస్టు కొనసాగుతోంది. మొదటి రోజు ముగిసింది. ఇక రెండో రోజు ఇంకా ఎన్ని పరుగులు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చేస్తాడనేది వేచి చూడాలి. ఇక ఈసారి న్యూజిలాండ్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. కెప్టెన్ విలియమ్సన్ తను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో సేథీ వచ్చాడు.
Also Read : నా వస్తువుల్ని తీసుకోనీయ లేదు