PAK vs SA T20 World Cup : చావో రేవో తేల్చుకోనున్న పాకిస్తాన్
గెలిస్తే ఓకే లేదంటే ఇంటికే
PAK vs SA T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ సూపర్-12 లో కీలకమైన మ్యాచ్ ఆడబోతోంది దాయాది పాకిస్తాన్ జట్టు. టోర్నీ కంటే ముందు బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు టైటిల్ ఫెవరేట్ గా ఉంది. విచిత్రం ఏమిటంటే దాయాది జట్లు ఒకే గ్రూప్ లో ఉండడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రారంభ మ్యాచ్ లోనే భారత్ , పాకిస్తాన్ జట్లు తలబడ్డాయి. టఫ్ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. ఇదే సమయంలో పాకిస్తాన్ కు జీవన్మరణ సమస్యగా మారింది. ఒకవేళ గెలిస్తేనే టోర్నీలో నిలుస్తారు. లేదంటే ఒకవేళ దక్షిణాఫ్రికా గనుక విజయం సాధిస్తే పాకిస్తాన్(PAK vs SA T20 World Cup) నేరుగా ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.
ఈ మ్యాచ్ అటు సఫారీలకు ఇటు పాకిస్తాన్ కు కీలకం కానుంది. దీంతో ఈ కీలక మ్యాచ్ హోరా హోరీగా సాగనుంది. ఇదే సమయంలో భారత జట్టు దాదాపు సెమీ ఫైనల్ కు వెళ్లినట్టే. నవంబర్ 3 గురువారం సిడ్నీ వేదికగా జరగనుంది కీలక మ్యాచ్. పాకిస్తాన్ ఇప్పటి వరకు టీమిండియా, జింబాబ్వే చేతిలో ఓటమి పాలైంది.
బంగ్లాదేశ్ పై ఒక దశలో ఓటమి అంచుల వద్దకు వెళ్లి చివరకు గెలిచి పరువు నిలుపుకుంది పాకిస్తాన్. ఏ రకంగా చూసినా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ప్రధానంగా కెప్టెన్ బాబర్ ఆజమ్ సామర్థ్యానికి పరీక్షగా మారింది. ఇక సౌతాఫ్రికా అన్ని ఫార్మాట్ లలో టాప్ లో కొనసాగుతూ వస్తోంద. బౌలింగ్ లో బ్యాటింగ్ లో ఎదురే లేని రీతిలో సాగుతోంది.
Also Read : బంగ్లాదేశ్ పై టీమిండియా భళా