Asia Cup 2023 : PAK vs SL ఆసియా కప్ ఫైనల్ కు శ్రీలంక
Asia Cup 2023 : అసలంక సూపర్ షో పాక్ కు షాక్
Asia Cup 2023 : కొలంబో – ఈసారి ఎలాగైనా ఆసియా కప్ 2023 గెలవాలని అనుకున్న పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లింది శ్రీలంక . శుక్రవారం జరిగిన ఉత్కంఠ భరిత పోరులో లంక ఆటగాడు అసలంక అద్భుతంగా రాణించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆసియా కప్ ఫైనల్ లోకి ప్రవేశించింది.
Asia Cup 2023 & Suspense
మ్యాచ్ చివరి దాకా నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. చివరకు 2 బంతులలో ఆరు పరుగులు చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్ ఊపిరి బిగపట్టి చూసింది. కానీ అసలంక వారి పాలిట శాపంగా మారాడు. తమ చేతుల్లో ఉన్న విజయాన్ని ఉన్నట్టుండి ఎగరేసుకు పోయాడు. విరోచితమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు అసలంక.
ముందుగా పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేసింది. 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది శ్రీలంకకు. అనంతరం బరిలోకి దిగిన లంక చివరి ఓవర్ దాకా పోరాడింది. ఆఖరి ఓవర్ లో గెలవాలంటే ఎనిమిది పరుగులు చేయాల్సి వచ్చింది.
చివరి ఓవర్ ను జమన్ ఖాన్ వేశాడు. 5వ బాల్ కు ఫోర్ , 6వ బంతికి 2 రన్స్ తీశాడు అసలంక. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం శ్రీలంక గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో శ్రీలంక నేరుగా ఫైనల్ కు చేరుకుంది. భారత్ తో తాడో పేడో తేల్చుకోనుంది.
ఇదిలా ఉండగా దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించి లంక విజేతగా నిలిచింది.
Also Read : IND vs PAK Asia Cup 2023 : భారత్ భళా పాక్ విలవిల