PAK vs SL Asia Cup Final : తుది సమరానికి పాకిస్తాన్ శ్రీలంక సై
ఆసియా కప్ -2022 ఫైనల్ మ్యాచ్ కు రెడీ
PAK vs SL Asia Cup Final : యూఏఈ వేదికగా జరుగుతున్న మినీ మెగా టోర్నీగా పేరొందిన ఆసియా కప్ -2022 ఇవాల్టితో తెర పడనుంది. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో చివరకు ఊహించని రీతిలో అండర్ డాగ్స్ గా పేరొందిన శ్రీలంక ఫైనల్(PAK vs SL Asia Cup Final) కు చేరుకుంది.
పాకిస్తాన్, భారత్ జట్లను మట్టి కరిపించింది. మరోసారి ఫైనల్ కు రెడీ అయ్యింది. పాకిస్తాన్ , శ్రీలంక జట్ల మధ్య తుది పోరుకు అరబ్ దేశం సిద్దమైంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఎవరు గెలుస్తారని ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది.
వాస్తవానికి ఆసియా కప్ ను శ్రీలంకలో నిర్వహించాల్సి ఉంది. కానీ ఆర్థిక, రాజకీయ, భద్రతా సంక్షోభం కారణంగా శ్రీలంక క్రికెట్ బోర్డు చేతులెత్తేసింది. తాము మెగా టోర్నీని నిర్వహించే స్థితిలో లేమని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఇంటర్నలేషన్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి తెలియ చేసింది. దీంతో ప్రత్యామ్నాయ వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని ఎంపిక చేసింది.
తాము నిర్వహించేందుకు రెడీగా ఉన్నామంటూ ముందుకు వచ్చింది యూఏఈ క్రికెట్ బోర్డు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టోర్నీలో దిగిన టీమిండియా అంచనాలు తలకిందులు చేస్తూ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
సూపర్ -4 దశలోనే వెనుదిరిగింది. దీంతో శ్రీలంక పాకిస్తాన్ తో యుద్దానికి సిద్దమైంది. ఇదిలా ఉండగా ఆసియా కప్ మెగా టోర్నీలో ప్రారంభ లీగ్ మ్యాచ్ లోనే చతికిల పడింది.
ఆఫ్గనిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాత దిగ్గజ జట్లకు చుక్కలు చూపించింది. ఫైనల్ కు చేరింది.
Also Read : నేను కోహ్లీ కంటే గొప్పగా ఆడాను – గంగూలీ