పాకిస్తాన్ క్రికెట్ హెడ్ కోచ్ బ్రాడ్ బర్న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమకు ఛాంపియన్ టీమ్ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన ఇవరి, ఐదవ టి20లో 2-1లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించక పోవడడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మార్క్ చాప్ మన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆరు వికెట్ల తేడాతో గెలిచి సీరీస్ ను 2-2తో డ్రాగా ముగించింది. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రిమీయర్ లీగ్ కారణంగా రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తో సహా టాప్ ఎనిమిది మంది ఆటగాళ్ళను కోల్పోయింది న్యూజిలాండ్.
ఇదే సమయంలో ప్రధాన ఆటగాళ్లు లేరని, సులువుగా విజయం సాధిస్తామని భావించిన పాకిస్తాన్ కు చుక్కలు చూపించారు కీవీస్ ఆటగాళ్లు. ఇదిలా ఉండగా భారత్ లో త్వరలో నిర్వహించే ప్రపంచ కప్ లేదా ఆసియా కప్ లో రాణించాలంటే ఇంకా మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని పాకిస్తాన్ ప్రధాన కోచ్ గ్రాంట్ బ్రాడ్ బర్న్ అన్నారు.
ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. మిక్కీ ఆర్థర్ ను కోచ్ గా నియమించింది. ఈ సందర్భంగా బ్రాడ్ బర్న్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిక్కీ ఆర్థర్ తో కలిసి జట్టును ఉద్దేశించి కీలక సూచనలు చేశామన్నాడు. మాకు ఛాంపియన్ జట్టు ఉందని కానీ ఆశించిన రీతిలో రాణించడం లేదన్నారు.