Imran Khan : ఖాన్ సాబ్ కు సుప్రీంకోర్టు షాక్

మ‌ళ్లీ ఓటింగ్ నిర్వ‌హించాల్సిందే

Imran Khan : పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. అవిశ్వాస తీర్మానం చెల్ల‌దంటూ పాకిస్తాన్ నేష‌న‌ల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. దీనిని స‌వాల్ చేస్తూ ప్ర‌తిప‌క్షాలు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి.

ఈ సంద‌ర్భంగా దాఖ‌లైన పిటిష‌న్ ను విచారించింది కోర్టు. రాజ్యాంగ బ‌ద్ద‌మైన అసెంబ్లీ ఎలా ర‌ద్దు చేస్తుందంటూ ప్ర‌శ్నించింది. ఒక ర‌కంగా నిల‌దీసింది. ఇది చెల్లుబాటు కాదంటూ స్ప‌ష్టం చేసింది.

ఇమ్రాన్ ఖాన్ పై విప‌క్షాలు చేప‌ట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తోసి పుచ్చ‌డం ప్ర‌జాస్వామ్యానికి పూర్తిగా విరుద్దం అంటూ పేర్కొంది. ఇది స‌రికాద‌ని మెట్టికాయ‌లు వేసింది.

పార్ల‌మెంట్ డిప్యూటీ స్పీక‌ర్ ఎలా తిర‌స్క‌రిస్తారంటూ ప్ర‌శ్నించింది కోర్టు. పాకిస్తాన్ సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఉమ‌ర్ అట బండియ‌ల్ నేతృత్వంలోని ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది.

ఈ సంద‌ర్భంగా అటార్నీ జ‌న‌ర‌ల్ ఖ‌లీద్ జావెద్ ఖాన్ త‌మ వాద‌న‌లు వినిపించారు ప్ర‌భుత్వం త‌ర‌పు నుంచి. పార్ల‌మెంట్ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌లో న్యాయ‌స్థానం జోక్యం సరికాదంటూ(Imran Khan) పేర్కొన్నారు.

స్పీక‌ర్ నిర్ణ‌యాల‌ను స‌వాల్ చేసే ప‌వ‌ర్స్ కోర్టుకు లేవంటూ వాదించారు. మొత్తం వాద‌న‌లు విన్న కోర్టు చీఫ్ జ‌స్టిస్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప‌వ‌ర్స్ ఉన్నాయా లేదా అన్న దానిని మీరు ప్ర‌స్తావించ‌డం మంచిదే.

కానీ ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకున్న దానిపై విరుద్దంగా నిర్ణ‌యం తీసుకునే అధికారం డిప్యూటీ స్పీక‌ర్ కు ఎలా ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. అవిశ్వాసం పై మ‌ళ్లీ ఓటింగ్ చేప‌ట్టాల‌ని తీర్పు చెప్పారు.

Also Read : మ‌మ్మ‌ల్ని చంప‌గ‌ల‌రు కానీ గెల‌వ‌లేరు

Leave A Reply

Your Email Id will not be published!