Shehbaz Sharif : పాకిస్తాన్ ప్రధానిగా నెక్ట్స్ ఎవరు అన్న దానికి తెర దించాయి ప్రతిపక్షాలు. ఇప్పటి వరకు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)నూతన ప్రధాన మంత్రిగా ఎంపిక కానున్నారు.
ఇదిలా ఉండగా షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్(Shehbaz Sharif) సోదరుడు కావడం విశేషం. ఈయనపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ మాజీ సీఎంగా ఉన్నారు.
పాకిస్తాన్ వెలుపల షెహబాజ్ షరీఫ్ గురించి ఎక్కువగా బయటి ప్రపంచానికి తెలియదు. కానీ దేశంలోని రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే సమర్థవంతమైన నాయకుడిగా పేరొందారు షెహబాజ్ షరీఫ్.
మూడు సార్లు దేశానికి ప్రధాన మంత్రిగా పని చేసిన నవాజ్ షరీఫ్ కు స్వయాన తమ్ముడు. ప్రస్తుతం ఆయనకు 70 ఏళ్లు ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి వేయడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.
ఆయనే నాయకుడిగా ఉన్నారు. పాకిస్తాన ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం 14 గంటల పాటు కొనసాగింది. ఆదివారం తెల్లవారుజామున 2 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
దీంతో ఇమ్రాన్ ఖాన్ తన ప్రధాని పదవిని కోల్పోయారు. ఆయన స్థానంలో షెహబాజ్ షరీఫ్ కొలువు తీరనున్నారు. విచిత్రం ఏమిటంటే షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ సైన్యంతో సత్ సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
1999లో పాకిస్తాన్ లో సైనిక తిరుగుబాటు కారణంగా షెహబాజ్ జైలు పాలయ్యాడు. దేశ బహిష్కరణకు గురయ్యాడు. 2007లో దేశానికి తిరిగి వచ్చాడు.
Also Read : ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాలు విసుర్లు