Pallavi Singh : ఆగ్రో టెక్నాలజీలో పల్లవి సింగ్ అదుర్స్
ఓజీ ఆగ్రో టెక్ వెంచర్ సూపర్ సక్సెస్
Pallavi Singh : కొత్త పోకడలు పోతున్న టెక్నాలజీని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కోవాలంటే పల్లవి సింగ్ గురించి అర్థం చేసుకోవాలి. ఓజీ ఆగ్రో అగ్రి టెక్ వెంచర్ ను ఏర్పాటు చేసింది.
సక్సెస్ ఫుల్ గా నడుపుతోంది. ఆమె మానసిక శాస్త్రం చదువుకుంది. శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. టీడీజీ మ్యాగజైన్ కూడా ఏర్పాటు చేసింది.
మేకప్ లో నైపుణ్యం తో పాటు ఫ్యాషన్ , లైఫ్ స్టైల్ , గ్రూమింగ్ , ట్రావెల్ , వినోదంపై ఆసక్తి కూడా ఎక్కువగా కలిగి ఉన్నారు పల్లవి సింగ్(Pallavi Singh). మహిళందరికీ సరైన ఉత్పత్తుల ఎంపికను సులభతరం చేసేలా చేసింది. దీని వల్ల ఆమె దేశంలోనే మోస్ట్ పాపులర్ ఉమెన్ గా పేరు పొందారు.
పల్లవీ సింగ్ ప్రసిద్ద సంస్థలు గార్మిన్ , మేబల్లైన్ , లాక్మే , నైకా, లోరియల్ ప్యారిస్ , న్యూట్రోజెనా వంటి భారతీయ, అంతర్జాతీయ బ్రాండ్ ల కోసం కొన్నేళ్ల పాటు పని చేసింది పల్లవి సింగ్.
ఆమె తన అనుభవాల ఆధారంగా ఉత్పత్తులను సమీక్షిస్తుంది. వాటికి రేటింగ్ కూడా ఇస్తుంది. పల్లవి సింగ్(Pallavi Singh) దేని గురించైనా కామెంట్స్ చేసినా లేదా ఆ ఉత్పత్తి గురించి అభిప్రాయం వ్యక్తం చేసినా లక్షల్లో లైక్ లు వస్తున్నాయి.
అందుకే ఆయా కంపెనీలు ఆమె వెంట పడేలా చేసుకుంది. బ్లాగర్ గా కూడా గుర్తింపు పొందారు. వంటలు, ఆరోగ్యం, ఫిట్ నెస్ ల గురించి కూడా రాస్తారు. సేంద్రీయ వ్యవసాయం గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టారు. డాక్టర్ , పబ్లిక్ హెల్త్ లో మాస్టర్స్ చేశారు పల్లవి సింగ్.
ఆమె రాసే బ్లాగ్ మోస్ట్ పాపులర్ . తొమ్మిదేళ్లుగా దీనిని రాస్తూ వచ్చారు. సైకాలజీలో మాస్టర్స్ కూడా చేశారు. ఓజీ ఆగ్రో అగ్రి టెక్ వెంచర్ తో సహా సమాంతరంగా ఇతర ప్రాజెక్టులలో కూడా పని చేస్తున్నారు.
Also Read : యోగా నామా’ అందానికి చిరునామా