Palvayi Sravanthi Reddy : గులాబీ గూటికి పాల్వాయి
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక
Palvayi Sravanthi Reddy : హైదరాబాద్ – కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి రెడ్డి హస్తానికి గుడ్ బై చెప్పారు. ఇవాళ ప్రగతి భవన్ లో జరిగిన కార్యక్రమానికి మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది.
Palvayi Sravanthi Reddy Joined in BRS
పార్టీ పరంగా పాల్వాయి కుటుంబానికి మునుగోడులో మంచి పట్టుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలకమైన నేతగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో స్రవంతి రెడ్డికి(Palvayi Sravanthi Reddy) పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ టీపీసీసీ పరంగా తనకు ఎలాంటి సపోర్ట్ రాలేదని ఆరోపించారు.
ఆమె రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి పార్టీ కోసం పని చేసినా వారు గుర్తించిన పాపాన పోలేదని, తనకు అన్యాయం చేశారని వాపోయారు.
ఇదే సమయంలో ఉన్నట్టుండి పార్టీకి గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖ సమర్పించారు.
తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇవాళ కేటీఆర్ చేతిలో కండువా కప్పుకున్నారు.
Also Read : Guvvala Balaraju : అంతం చేసేందుకే దాడి చేశారు