Prabhas Project K : ప్రాజెక్టు కె మూవీలో విష్ణువుగా ప్రభాస్
వెల్లడించిన మూవీ మేకర్స్
Prabhas Project K : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు కె మూవీపై రోజుకో అప్ డేట్ వస్తోంది. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆది పురుష్ మిశ్రమ స్పందన మూటగట్టుకుంది. ట్రైలర్ నుంచి విడుదలయ్యేంత దాకా అన్నీ వివాదాలే చుట్టు ముట్టాయి. మహానటి సినిమాతో యావత్ దేశాన్ని తన వైపు తిప్పుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో తీస్తుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనేతో పాటు తమిళ సినీ రంగంలో లోక నాయకుడుగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ , బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ ప్రాజెక్టు కె(Project K) చిత్రంలో నటిస్తున్నారు.
సోషియో ఫాంటసీ సినిమాగా ఉంటుందని అంచనా వేశారు. కానీ తాజాగా మూవీ మేకర్స్ ప్రభాస్ గురించి ఆసక్తికర వార్తను పంచుకున్నారు. అదేమిటంటే ఇందులో ఆధునిక విష్ణువు పాత్రలో నటిస్తున్నాడని పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ లో కొనసాగుతున్నాడు డార్లింగ్ ప్రభాస్ .
ఇక ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించి సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను చిత్రీకరణ చూశానని, ఇది విడుదలైన తొలి రోజే రూ. 1,000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని జోష్యం చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. విడుదల చేసిన పోస్టర్లు దుమ్ము రేపుతున్నాయి. సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : Udhay Nidhi Stalin : మామన్నన్ సక్సెస్ ఉదయనిధి జోష్