Panchamukhi : కర్ణాటక- తెలంగాణ సరిహద్దులో ఉన్న శ్రీ పంచముఖి దేవాలయం (Panchamukhi )ఘనమైన చరిత్రను స్వంతం చేసుకున్నది.
ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి ఈ ఆలయానికి భక్తులు రావడం పరిపాటిగా మారింది.
కర్ణాటకలో అత్యంత పేరొందిన దేవాలయాలలో ఇది ముఖ్యమైనది.
మఠాలలో పేరొందిన మఠంగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠానికి చరిత్ర ఉన్నది. విశిష్టమైన వారసత్వం ఉన్నది.
ప్రస్తుతం సుశీంద్రులు మఠానికి పీఠాధిపతిగా ఉన్నారు. గతంలో పోల్చితే ఎన్నడూ లేనంతగా తిరుపతి పుణ్యక్షేత్రానికి ధీటుగా ..సకల సౌకర్యాలతో ..ఘనమైన ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఇదంతా ఆలయ నిర్వాహకుల కృషి వల్లనే సాధ్యమైంది. ఎక్కడా ఇబ్బంది అంటూ తలెత్తకుండా ఉండేలా చర్యలు చేపట్టారు.
ఓ వైపు ట్రైన్ సౌకర్యంతో పాటు బస్సులు ఎళ్లవేళలా అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్రాంతానికి ఎంతటి చరిత్ర ఉందో ..రాయిచూర్ – మంత్రాలయం పీఠం కు వెళ్లే
జాతీయ రహదారి మధ్యలో ఎరిగేరి మండల పరిధిలో పంచముఖి ఆలయం(Panchamukhi )ఉంది.
ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. వేలాది మంది అమవాస్య అయ్యిందంటే చాలు ఎక్కడెక్కడి నుండో ఈ ఆలయానికి తరలి వస్తుంటారు.
నాలుగైదు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు ఇక్కడ కొలువు తీరిన ఆంజనేయ స్వామిని దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఒక్కసారి వెళితే తిరిగి మళ్లీ వచ్చే అమవాస్య రోజున తప్పక భక్తులు కొలువుతీరిన ఆంజనేయుడిని సందర్శిస్తారు.
ఆలయానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం ఉన్నది. ప్రతి అమవాస్య రోజున పంచముఖి ఆంజనేయుడిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. వేలాది మంది భక్తుల భగవత్ నామ స్మరణతో మార్మోమ్రోగుతోంది.
ఆలయం, కోనేరు, కావాల్సిన సదుపాయాలన్నీ అక్కడ కొలువు తీరాయి. ఆలయానికి ధర్మకర్తల మండలి ఏర్పాటై ఉన్నది.
ఈ పంచముఖి గుడి నిర్వహణ మొత్తం శ్రీశ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్నది.
ప్రతి పైసా ..నిర్వహణ ఖర్చంతా మఠం చూసుకుంటుంది. అటు మంత్రాలయం ఇటు పంచముఖి ఆంజనేయుడి ఆలయం రెండూ అభివృద్ధి చెందుతున్నాయి.
చిన్నారులు, పెద్దలు, పేదలు, వ్యాపారులు, ఉద్యోగులు, సమస్యలతో సతమతమయ్యే వారు ఇలా ప్రతి ఒక్కరు హనుమంతుడి కరుణ కటాక్షం కోసం వేచి చూస్తారు.
అమవాస్య రోజు వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు. ఇటీవల భక్తుల సంఖ్య ఎక్కువైంది. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
జంటలకు దగ్గరుండి ప్రత్యేక పూజలు చేస్తారు. తేరును గుంజుతారు. స్వామి వారిని భక్తుల సాక్షిగా ఆలయం ముందు స్వామి వారిని ఊరేగింపు చేస్తారు.
భక్తులంతా స్వామి వారిని తలుచుకుంటూ..స్మరిస్తూ తేరు గుంజుతారు.
ప్రత్యేక పూజలు చేస్తారు. గుడికి వెనుక వైపు రక్షణగా అమ్మ వారు కొలువు తీరి ఉన్నారు.
అదే రోజు గ్రంథాలయం ఊరి పక్కనే మరో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు లక్ష్మణ స్వామి.
అమవాస్య రోజు ఎంతో మంది తమ బాధలు, సమస్యలను ఆ స్వామికి విన్నవించుకుంటారు.
రాయిచూరు, ఆదోని, కర్నూలు, గద్వాల, వనపర్తి, ఎమ్మిగనూరు, తదితర ప్రాంతాల నుండి భక్తులకు బస్సు సౌకర్యాలు ఉన్నాయి.
భారీ ఎత్తున ప్రైవేట్ వాహనాలతో కూడా భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.
పూజలు చేస్తారు. స్వామి వారిని అమవాస్య రోజు తల్చుకున్నా లేదా పూజించినా లేదా ఊరేగింపులో పాల్గొన్నా మంచే జరుగుతుందని
ఇక్కడి ప్రజల విశ్వాసం. భక్తుల నమ్మకం. పంచముఖిని అప్పట్లో గురు రాఘవేంద్రుడు సందర్శించినట్టు చరిత్ర చెబుతోంది.
మొత్తం మీద ఈ పంచముఖిని మీరు దర్శించుకోండి. సకల సమస్యల నుంచి విముక్తి పొందండి. భక్తితత్వంతో కొలువుతీరిన ఆ ఆంజనేయుడిని దర్శించుకోండి. సుఖ సంతోషాలతో జీవించండి.
ఈ ఆలయం చుట్టూ గుట్టలు, కొండలతో నిండి ఉంటుంది. చుట్టూరా పొలాలు , సాగుతో నిండి ఉన్నాయి.
Also Read : ఆహా… ఏమి రుచి…..మామిడి తినరా మైమరచి