Pandit Shiv Kumar Sharma : పండిట్ శివకుమార్ శర్మ ఇక లేరు
దేశం కోల్పోయిన సంగీత దిగ్గజం
Pandit Shiv Kumar Sharma : భారతీయ సంగీత ప్రస్థానంలో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన సంగీత దిగ్గజం సంతూర్ విధ్వాంసుడు , సంగీత దర్శకుడు పండిట్ శివ కుమార్ శర్మ మంగళవారం ముంబైలో కన్ను మూశారు.
గత కొంత కాలంగా ఆయన మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతున్నారు. అకస్మాత్తుగా ఆయనకు గుండె పోటు రావడంతో కన్ను మూసినట్లు కుటుంబీకులు వెల్లడించారు. దేశానికి సంబంధించి సంప్రదాయ సంగీతకారుల్లో శివకుమార్ శర్మ(Pandit Shiv Kumar Sharma) ఒకరు.
ఆయన వయసు 84 ఏళ్లు. గత కొంత కాలం నుంచి డయాలసిస్ ద్వారా చికిత్స తీసుకుంటున్నారు. నిత్యం సంగీత సాధనలో మునిగి పోయే వారు. ఒక రకంగా పండిట్ శివ కుమార్ శర్మ వల్లే సంతూర్ వాయిద్యానికి అనంతమైన పేరు వచ్చింది.
శివకుమార్ శర్మ(Pandit Shiv Kumar Sharma) 1938 లో కశ్మీర్ లో పుట్టారు. భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ తో సత్కరించింది. కాశ్మీర్ లో జానపద వాద్య పరికరాన్ని ఉపయోగించిన మొదటి వ్యక్తి ఆయనే కావడం విశేషం.
ప్రముఖ ఫ్లూట్ వాయిద్య కారుడు పండిట్ హరి ప్రసాద్ చౌరాసియాతో కలిసి సిల్సిలా, లమ్హే , చాందిని వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించారు.
సంతూరు వాయిద్య కారుడు పండిట్ శివ కుమార్ శర్మ(Pandit Shiv Kumar Sharma) మరణంతో ఒక శకం ముగిసిందని పేర్కొన్నారు ప్రముఖ సరోద్ ప్లేయర్ అంజాద్ అలీ ఖాన్. ఆయన ట్విట్టర్ ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటుగా పేర్కొన్నారు. ఆయన సంగీతం కలకాలం నిలిచి ఉంటుందన్నారు.
Also Read : వికీపీడియాపై వివేక్ అగ్నిహోత్రి ఫైర్