Shikhar Dhawan : సంజూ శాంసన్ కంటే పంత్ బెటర్
వంత పాడిన వన్డే కెప్టెన్ శిఖర్ ధావన్
Shikhar Dhawan : కీవీస్ తో వన్డే సీరీస్ కోల్పోయిన భారత జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిస్సిగ్గుగా రిషబ్ పంత్ కు సపోర్ట్ చేశాడు. ఒక రకంగా వంత పాడాడు. తాత్కాలిక కెప్టెన్ శిఖర్ తో పాటు తాత్కాలిక కోచ్ గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ సైతం పంత్ ను వెనకేసుకు వచ్చారు.
మ్యాచ్ ముగిశాక మీడియాతో మాట్లాడిన శిఖర్ ధావన్ ఎందుకు పంత్ ను కొనసాగించాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. గత 11 ఇన్నింగ్స్ లు పంత్ ఆడితే 10 ఇన్నింగ్స్ లలో పేలవమైన ఆట తీరుతో నిరాశ పరిచాడు. ఇదిలా ఉండగా క్రికెట్ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.
ఆపై మాజీ క్రికెటర్లు సైతం బీసీసీఐని, ధవన్, పాండ్యా, లక్ష్మణ్ లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా బీసీసీఐ, రిషబ్ పంత్ , సంజూ శాంసన్ లు ట్రెండింగ్ లో ఉన్నాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సైతం సంజూ శాంసన్ కు మద్దతుగా నిలిచారు. ప్రధానంగా డానిష్ కనేరియా అయితే బీసీసీఐని ఏకి పారేశాడు.
రాజకీయాలు పక్కన పెట్టి శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలని సూచించాడు. ఇదిలా ఉండగా శిఖర్ ధావన్(Shikhar Dhawan) పంత్ మ్యాచ్ విన్నర్ అంటూ కితాబు ఇచ్చాడు. అందుకే జట్టులో ఉన్నాడని చెప్పాడు. అయితే సంజూ శాంసన్ గొప్ప ప్లేయర్ అంటూనే ఇంకా కొంచెం వెయిట్ చేయాలని సూచించాడు.
అయితే వైట్ బాల్ ఫార్మాట్ లో రిషబ్ పంత్ సాధించిన 9 ఇన్నింగ్స్ లలో స్కోర్ చేసింది 10, 15, 11, 6, 6, 3, 9, 9, 27 పరుగులు మాత్రమే. మరి ఈ గణాంకాలు ధావన్ కు అర్థం కాలేదా లేక చదువు రాదా అని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.
Also Read : శాంసన్ అద్భుతం బీసీసీఐ తీరు దారుణం