Sunil Gavaskar : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ మనోహర్ గవాస్కర్(Sunil Gavaskar) కీలక కామెంట్స్ చేశాడు. భారత జట్టు రెండో వన్డే మ్యాచ్ ఓటమి తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా మేనేజ్ మెంట్ ఇద్దరి విషయంలో మంచి పని చేసిందన్నాడు. రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్ లు మంచి ఫినిషర్స్ గా భవిష్యత్తులో భారత జట్టుకు ఉపయోగ పడతారని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో జట్టుకు మంచి ఫినిషర్ గా మహేంద్ర సింగ్ ధోనీ ఉండేవాడని ప్రస్తుతం అతడి ప్లేస్ ను పంత్ , శార్దూల్ భర్తీ చేస్తున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నాడు.
టీమ్ పరంగా ప్లేస్ లు పదే పదే మార్చడం వల్ల ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపం ఏర్పడుతుందని, టీమ్ హెడ్ కోచ్ ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నాడని ప్రశంసించాడు సునీల్ మనోహర్ గవాస్కర్(Sunil Gavaskar).
అయితే మరోసారి సీరియస్ అయ్యాడు సన్నీ జట్టు తాత్కాలిక స్కిప్పర్ కేఎల్ రాహుల్ పై. అత్యంత పేలవమైన నాయకత్వం కారణంగా భారత జట్టు ఓడి పోయిందని మండిపడ్డాడు.
జట్టు గాడిలోకి రావాలంటే కొంత సమమయం పడుతుందని, ఆ లోపు ఎక్కడ పొరపాట్లు జరిగాయనే దానిపై హెడ్ కోచ్ ఫోకస్ పెట్టాలని సూచించాడు గవాస్కర్.
ఆరోగ్యకరమైన పోటీ అవసరమని ఎవరినీ ఎక్కువ కాలం మోయలేమన్న సంగతిని ఆటగాళ్లు గుర్తుంచు కోవాలని స్పష్టం చేశాడు. రాబోయే రోజుల్లో ద్రవిడ్ మరిన్ని మార్పులు చేసే అవకాశం లేక పోలేదని అభిప్రాయ పడ్డాడు సన్నీ.
Also Read : రోహిత్ శర్మ అయితే బెటర్