SAvsIND 3rd Test : కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ 198 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా (SAvsIND 3rd Test)ముందు 212 పరుగుల టార్గెట్ ఉంచింది. మొదటి ఇన్నింగ్స్ లో 13 పరుగులతో కలుపుకుంటే ఈ స్కోర్ సాధించింది.
ఇదిలా ఉండగా పేలవమైన ఆట తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ (SAvsIND 3rd Test)సత్తా చాటాడు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో సఫారీ బౌలర్ల భరతం పట్టాడు.
సరిగ్గా 100 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. తొమ్మిదో వికెట్ రూపంలో షమీ వెనుదిరిగాడు. ఉమేష్ యాదవ్ డకౌట్ అయ్యాడు. 170 పరుగులు ఉన్న సమయంలో టీమిండియా ఏడో వికెట్ పారేసుకుంది.
శార్దూల్ ఠాకూర్ ఎంగిడి బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక 162 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆరో వికెట్ కోల్పోయింది భారత జట్టు. జాన్సెన్ కు క్యాచ్ ఇచ్చి రవిచంద్రన్ అశ్విన్ 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.
ఇక లంచ్ అయ్యాక ప్రారంభమైన మ్యాచ్ లో కోలుకోలేని దెబ్బ తగిలింది. నిలకడగా ఆడుతూ వస్తున్న టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీ 4 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. లేని షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు.
ఎంగిడి బౌలింగ్ లో ఈజీ క్యాచ్ ఇచ్చి వెళ్లాడు. దీంతో 152 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఎలాంటి బెరుకు లేకుండా రిషబ్ పంత్ రాణించాడు.
తన సత్తాతో మరోసారి వెలుగులోకి వచ్చాడు. సెంచరీతో సమాధానం చెప్పాడు.
Also Read : రాహుల్ కు వికెట్ కీపింగ్ వద్దు