Sanju Samson Pant : పంత్ కే ప్రయారిటీ శాంసన్ కు కష్టమే
వన్డే జట్టులో చోటు కష్టమే
Sanju Samson Pant : భారత క్రికెట్ జట్టు హార్దిక్ పాండ్యా సారథ్యంలో టి20 సీరీస్ గెలుచుకున్నా దానిపై ఎవరూ అంతగా ఫోకస్ పెట్టలేదు. కానీ సోషల్ మీడియాలో ప్రధానంగా ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఏకైక పేరు కేరళ స్టార్ సంజూ శాంసన్. ఎందుకని బీసీసీఐ అతడిపై కక్ష కట్టిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రేయస్ అయ్యర్ , దీపక్ హూడా, రిషబ్ పంత్(Rishabh Pant) కంటే మెరుగైన రన్స్ తో పాటు స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నా ఎంపిక చేయడం లేదంటూ మండి పడుతున్నారు. టి20 సీరీస్ లో వ్యూహాత్మకంగా పక్కన పెట్టామని చెప్పాడు పాండ్యా. మీడియా అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక పోయాడు .
ప్రస్తుతం వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ సారథ్యంలో టీమిండియా వన్డే సీరీస్ కు రెడీ అవుతోంది. ఈ సీరీస్ లో కూడా శాంసన్(Sanju Samson) కు ఛాన్స్ దక్కడం కష్టమేనంటున్నారు ఫ్యాన్స్. వరుసగా వైఫల్యం చెందుతూ వస్తున్నా ఎందుకని రిషబ్ పంత్ ను ఆడిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
దీనికి బీసీసీఐ వద్ద ఎలాంటి సమాధానం లేదు. ఇవాళ ఆక్లాండ్ లో తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. దీపక్ హూడా ఆల్ రౌండర్ కావడంతో శాంసన్ ను తీసుకోక పోవచ్చని అంచనా. ఓపెనర్లుగా శిఖర్ ధావన్ , శుభ్ మన్ గిల్ , శ్రేయస్ అయ్యర్ , సూర్య కుమార్ యాదవ్ , రిషబ్ పంత్ స్థానాలు ఇప్పటికే ఖరారై పోయాయి.
ఇక సంజూ శాంసన్ కు అవకాశం పూర్తిగా మూసుకు పోయినట్లే. ఇక బౌలింగ్ విషయానికి వస్తే దీపక్ చాహర్, శార్దూల్ , అర్ష్ దీప్ , చాహల్ , కుల్దీప్ యాదవ్ ఉన్నారు. వీరిని కాదని ఉమ్రాన్ మాలిక్ కు ఛాన్స్ దొరకడం దాదాపు కష్టమే.
Also Read : కెప్టెన్సీ కంటే దేశం ముఖ్యం – శిఖర్ ధావన్