Paramhamsa Acharya : ఉద‌య‌నిధి త‌లకు ‘వెల‌’

ఆచార్య ప‌రమ‌హంస ప్ర‌క‌ట‌న

Paramhamsa Acharya : స‌నాత‌న ధ‌ర్మంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ త‌న‌యుడు, న‌టుడు, మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. దేశ వ్యాప్తంగా ధార్మిక‌, హిందూ సంస్థ‌లు పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Paramhamsa Acharya Comments Viral

తాజాగా యూపీ అయోధ్య‌కు చెందిన సాధువు ప‌ర‌మ‌హంస ఆచ‌ర్యా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏకంగా ఉద‌య‌నిధి స్టాలిన్(Udhayanidhi Stalin) త‌ల నరికి తీసుకు వ‌స్తే వారికి రూ. 10 కోట్లు బ‌హుమనంగా ఇస్తాన‌ని అన్నారు. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

ఉద‌య‌నిధి స్టాలిన్ ఫోటోను క‌త్తితో కోశాడు. త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశాడు. ఈ సంద‌ర్బంగా ప‌ర‌మ‌హంస ఆచార్య మాట్లాడారు. స‌నాత‌న ధ‌ర్మానికి ల‌క్ష‌ల సంవ‌త్స‌రాల కింద‌టే మూలాలు ఉన్నాయ‌ని అన్నారు. 2 వేల సంవ‌త్స‌రాల నుండి కొన్ని మ‌తాలు ఉనికి లోకి వ‌చ్చాయ‌ని చెప్పారు. భూమిపై ఒకే మ‌తం ఉంది. ఆ మ‌తం స‌నాత‌న ధర్మం అని స్ప‌ష్టం చేశాడు ప‌ర‌మహంస ఆచార్య‌.

స‌నాతన ధ‌ర్మానికి ఆది, అంతం అంటూ ఉండ‌ద‌న్నారు. ఎప్పటికీ నాశ‌నం కాలేద‌న్నార‌ను. స‌నాత‌న ధ‌ర్మాన్ని ధ్వంసం చేసేందుకు ఎవ‌రైనా ప్ర‌య‌త్నం చేస్తే వారిని నాశ‌నం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Also Read : Heavy Rains : భారీ వ‌ర్షం అత‌లాకుత‌లం

Leave A Reply

Your Email Id will not be published!