Paresh Rawal : బెంగాలీలు మనసారా మన్నించండి – రావల్
చేపలు వండుతారంటూ కామెంట్స్
Paresh Rawal : ప్రముఖ బాలీవుడు నటుడు పరేష్ రావల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పశ్చిమ బెంగాల్ వాసులను గేలి చేస్తూ కామెంట్స్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఎంతో పరిణతి చెందిన నటుడిగా ఉన్న పరేష్ రావల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమంటూ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నోకల్లో భాగంగా రెండో విడత ఎన్నికల ప్రచారంలో పరేష్ రావల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెంగాలీలను టార్గెట్ చేశారు నటుడు. బెంగాలీలలు లాగా చేపలు వండండి అంటూ వ్యాఖ్యానించారు. పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పరేష్ రావల్(Paresh Rawal) క్షమాపణలు చెపుతున్నట్లు ప్రకటించాడు.
తాను కావాలని అనలేదని, మనసు నొప్పిస్తే క్షమించమని కోరాడు. గుజరాత్ ప్రజలు ద్రవ్యోల్బణాన్ని సహిస్తారని, కానీ పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లు , రోహింగ్యాలను సహించరని అన్నారు పరేష్ రావల్. చేపలను బెంగాలీల లాగా ఉడికించాలంటూ నోరు జారారు. ఆయన కెరీర్ పై ప్రభావం చూపుతుందని గమనించిన నటుడు దిగి వచ్చారు.
గ్యాస్ సిలిండర్లు ఖరీదైనవి. కానీ విటి ధర తగ్గుతుందని, ప్రజలకు ఉపాధి కూడా లభిస్తుందన్నారు పరేష్ రావల్(Paresh Rawal). కానీ రోహింగ్యా వలసదారులు, బంగ్లాదేశీయులు మీ చుట్టూ ఢిల్లీలో నివసించడం ప్రారంభిస్తే ఏమి జరుగుతుందని ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్లతో మీరేం చేస్తారు..బెంగాలీల లాగా చేపలు వండండి అని కామెంట్ చేయడం కలకలం రేపింది.
చివరకు క్షమాపణలు చెప్పినా బెంగాలీలు మాత్రం భగ్గుమంటున్నారు.
Also Read : మోదీ కామెంట్స్ కాంగ్రెస్ సీరియస్
of course the fish is not the issue AS GUJARATIS DO COOK AND EAT FISH . BUT LET ME CLARIFY BY BENGALI I MEANT ILLEGAL BANGLA DESHI N ROHINGYA. BUT STILL IF I HAVE HURT YOUR FEELINGS AND SENTIMENTS I DO APOLOGISE. 🙏 https://t.co/MQZ674wTzq
— Paresh Rawal (@SirPareshRawal) December 2, 2022