Patnam Mahender Reddy : రోహిత్ రెడ్డిపై మహేందర్ రెడ్డి ఫైర్
ఎవరు ఔట్ డేటెడ్ అన్నది తేలుతుంది
Patnam Mahender Reddy : తాండూరు నియోజకవర్గం లోని భారత రాష్ట్ర సమితి పార్టీలో లొల్లి మొదలైంది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం మొదలైంది. తనను ఔట్ డేటెడ్ అంటూ రోహిత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ. ఎవరికి టికెట్ దక్కుతుందనేది త్వరలో తేలుతుందన్నారు మహేందర్ రెడ్డి. తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.
తాను ఔట్ డేటెడ్ కాలేదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డినే ఔట్ డేటెడ్ అయ్యాడంటూ మండిపడ్డారు. అనుకోకుండా గెలిచి మొనగాడినని అనుకుంటున్నాడంటూ ఎద్దేవా చేశారు పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy). గతంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పుణ్యాన రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందాడని ఆయనకు అంత సీన్ లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.
మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని, ఎవరికి ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందో తేలుతుందన్నారు పట్నం మహేందర్ రెడ్డి. ఎమ్మెల్సీ రోహిత్ రెడ్డి చేసిన కామెంట్స్ పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు. అధిష్టానం తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిందన్నారు.
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు. కొందరు కావాలని చేస్తున్న ప్రచారాన్ని తాను పట్టించు కోనని స్పష్టం చేశారు.
Also Read : Pawan Kalyan Comment : ఎవరీ ‘జగ్గూ భాయ్’ ఏమిటా కథ