MLA Pilot Rohit Reddy : ప‌ట్నం ప‌నై పోయింది – రోహిత్ రెడ్డి

ఎమ్మెల్సీ పై ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

MLA Pilot Rohit Reddy : తాండూరు ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డిపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. పార్టీలో ప‌ట్నం ప‌నై పోయింద‌న్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌రోసారి టికెట్ వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేద‌న్నారు. త‌న ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు మ‌రింత విశ్వాసం పెరిగింద‌న్నారు. గ‌తంలో ప‌ని చేసిన వారి కంటే తాను అద్భుతంగా తాండూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది చేశాన‌ని స్ప‌ష్టం చేశారు ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డి(Pilot Rohit Reddy).

తనకు ఎమ్మెల్యే టికెట్ వ‌స్తుంద‌ని మ‌హేంద‌ర్ రెడ్డి క‌ల‌లు కంటున్నాడ‌ని కానీ ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్నారు. పార్టీ త‌న‌కు ఎప్పుడో హామీ ఇచ్చింద‌ని తెలిపారు. మ‌రోసారి బంప‌ర్ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుస్తాన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. తాను ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన‌ప్ప‌టి నుంచి నేటి దాకా ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉన్నాన‌ని, వారికి అండ‌గా నిల‌బ‌డ్డాన‌ని చెప్పారు రోహిత్ రెడ్డి.

పార్టీ మారే వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ ఎమ్మెల్యే ప్ర‌శ్నించారు. హైకమాండ్ అన్నీ గ‌మ‌నిస్తుంద‌ని , చివ‌ర‌కు త‌న‌కే టికెట్ ద‌క్క‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఇక త్వ‌ర‌లో జ‌రిగే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి లేదా ఇత‌ర పార్టీల నుంచి ఎవ‌రు నిల‌బ‌డినా వాళ్ల‌కు డిపాజిట్ కూడా ద‌క్క‌ద‌న్నారు పైలట్ రోహిత్ రెడ్డి.

Also Read : Patnam Mahender Reddy : రోహిత్ రెడ్డిపై మ‌హేంద‌ర్ రెడ్డి ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!