Pawan Kalyan : హైదరాబాద్ – తెలంగాణ ఎన్నికల్లో భాగంగా గురువారం ఓటు హక్కు వినియోగించుకున్నారు పవర్ స్టార్ , జనసేనాని చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). సినీ రంగానికి చెందిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, జూనియర్ ఆర్టిస్టులు సైతం ఓటు వేసేందుకు బారులు తీరి ఓటు వేశారు.
Pawan Kalyan Voting Completed
సినీ స్టార్లలో మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ఆయన సతీమణి, కళ్యాణ్ రామ్ , అల్లు అర్జున్ , అల్లు అరవింద్ , దర్శకులు తేజ, శేఖర్ కమ్ముల, సింగర్ సునీత , తమ్మారెడ్డి భరద్వాజ, హరీశ్ శంకర్ , రాజేంద్ర ప్రసాద్ , తదితరులు ఓటు వేశారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల దాకా జరుగుతుంది. ఇక సమస్యాత్మక ప్రాంతాలలో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది.
మరో వైపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వీరంతా ఓటు వేశారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గాంధీ ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ బరిలో ఉన్నారు. ఆయన తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు.
Also Read : Asaduddin Owaisi : ఓటేసేందుకు ముందుకు రావాలి