Pawan Kalyan Comment : ఎవరీ ‘జగ్గూ భాయ్’ ఏమిటా కథ
పవర్ స్టార్ పవర్ లోకి వస్తారా
Pawan Kalyan Comment : జగ్గూ భాయ్ ఏమిటిది కొత్త పేరు వినిపిస్తోందని అనుకుంటున్నారా. అవును పదే పదే ఈ పదం వైరల్ గా మారింది. ప్రధానంగా జనసేన(Janasena) పార్టీ జగ్గూ భాయ్ ని ఉపయోగిస్తోంది. ఏపీలో మాటలు మంటలు రేపుతున్నాయి. రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. నువ్వా నేనా అన్న స్థాయికి చేరి పోయాయి. వీటిని పక్కన పెడితే జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ఆయన మాటల డోసు కూడా పెంచేశారు. గతంలో వైసీపీ సర్కార్ ను ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు తన మాట తీరును మార్చేశారు. సమస్యలను ప్రస్తావిస్తూనే పదే పదే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. వైఫల్యాలను ఎండగడుతూ ఏకంగా జగన్ రెడ్డికి జగ్గూ భాయ్ అని పేరు పెట్టాడు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం ఏకంగా నాలుగేళ్ల కాలంలో లక్ష కోట్లు దోచుకున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఆయన ఏపీలో వారాహి విజయ యాత్రకు శ్రీకారం చుట్టారు. తొలి విడత యాత్ర సక్సెస్ అయ్యింది. జనం నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. ఇదే సమయంలో రెండో విడత కూడా ప్రారంభించారు. తణుకు వేదికగా పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆవేదన చెందారు. ఆపై ఎక్కడైనా ఆలయాలకు సంబంధించి ఆస్తులను కాపాడుకుంటారని, కానీ ఇక్కడ ఏకంగా అర్చకులను వేలం వేసే స్థాయికి దిగజారారంటూ మండిపడ్డారు జనసేనాని. మొత్తం ఏపీలో జగన్ కొలువు తీరాక 219 ఆలయాలపై దాడులు జరిగాయంటూ లెక్కలతో సహా ప్రకటించారు. ఆపై వాలంటీర్ల వ్యవస్థను పదే పదే లేవదీస్తున్నారు. దీనిపై తనకే కాదు యావత్ ఏపీ రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఏపీకి సంబంధించిన ప్రజల సమాచారం మొత్తం హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ లోని ఎఫ్ఏఓ సంస్థలో ఉందని, ఇది ఎవరిదో ఎందుకు అక్కడ డేటా నిక్షిప్తమై ఉందో చెప్పి తీరాలని కోరారు.
ఆపై అందులో 700 మందికి పైగా పని చేస్తున్నారని వీరికి వేతనాలు ఎవరు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల కోసం రూ. 30 వేల కోట్లు వెనకేసుకున్నాడని ప్రజలు ఇకనైనా మారాలని, తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు పవన్ కళ్యాణ్. జనసేన(Janasena) కార్యకర్తలు, నేతలపై దాడులు చేయడం మానుకోవాలని లేక పోతే తాట తీస్తానంటూ హెచ్చరించారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ దూకుడు పెంచడంతో జన సైనికుల్లో ఫుల్ జోష్ పెరిగింది. మరో వైపు అధికారంలో ఉన్న వైసీపీ అందుకు ధీటుగా సమాధానం ఇస్తోంది. తాము చేపట్టిన ప్రగతి తమను రక్షిస్తుందని , తమకు ఢోకా లేదంటోంది. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు తమవేనంటోంది.. ఇక టీడీపీ, బీజీపీ తో పాటు జనసేన(Janasena) మూకుమ్మడిగా దాడికి దిగడం మాత్రం ఒకింత విస్తు పోయేలా చేస్తోంది. ఏది ఏమైనా మొత్తంగా జగ్గూ భాయ్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారడం విశేషం..విచిత్రం కూడా.
Also Read : Ambati Rambabu : పవన్ కళ్యాణ్ ఏకపత్నీవ్రతుడు