Pawan Kalyan : ఎన్నారైల స‌హాయం ప్ర‌శంస‌నీయం

జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్

Pawan Kalyan : మంగ‌ళ‌గిరి – ప్ర‌వాస ఆంధ్రులు జ‌న‌సేన పార్టీకి తోడ్పాటు అందించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు ఆ పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఎన్నారైల సేవ‌ల‌ను త‌మ పార్టీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మ‌రిచి పోద‌ని స్ప‌ష్టం చేశారు.

Pawan Kalyan Praises NRI’s

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ప్ర‌వాస భార‌తీయుల స‌మావేశంలో ప‌వ‌ర్ స్టార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న ప‌ట్ల ప్రేమాభిమానాల‌తో ముందుకు రావ‌డం త‌న‌ను మ‌రింత ఆనందంగా ఉంద‌న్నారు జ‌న‌సేన పార్టీ చీఫ్‌.

ఇదిలా ఉండ‌గా పార్టీకి సంబంధించి రూ. 1.30 కోట్లు విరాళం అందించ‌డాన్ని ప్ర‌త్యేకంగా అభినందించారు. రాబోయే రోజుల్లో మ‌రింత తోడ్పాటు అందించేందుకు కృషి చేయాల‌ని సూచించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pawan Kalyan ). ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ పాల‌న‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌జ‌లు తీవ్రమైన ఇబ్బందుల‌కు లోన‌వుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి జ‌న‌సేన పార్టీ ముందుకు వెళుతుంద‌ని తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ప్ర‌జ‌లు అహంకార పూరిత పాల‌న ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని, ఆయ‌న ప‌రివారాన్ని ఇంటికి పంపించేందుకు సిద్దంగా ఉన్నార‌ని జోష్యం చెప్పారు.

Also Read : KTR Slams : హామీలు స‌రే అమ‌లు జాడేది

Leave A Reply

Your Email Id will not be published!