Pawan Kalyan Lohiya : రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలు అర్థం చేసుకోవాలి

Pawan Kalyan Lohiya : ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన పార్టీ కి రోజు రోజుకు మరింత ఆదరణ పెరుగుతుంది. జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సారిగా కులాల ఐక్యత తీసుకువచ్చారు. తాజాగా రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలను (Pawan Kalyan Lohiya)  వెలుగెత్తి చాటుతున్నారు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఒక సందేశం విడుదల చేశారు.

“దేశంలో కుల సమస్య… కులాలపై శాస్త్రీయ అవగాహన.. వాటి పుట్టుపూర్వోత్తరాలు సాంస్కృతిక జీవనం గురించి సాధికారికంగా విశాల దృక్పథంతో మాట్లాడిన మహనీయులు శ్రీ రామ్ మనోహర్ లోహియా గారు. ఆయన ప్రతిపాదించిన సోషలిస్ట్ సిద్ధాంతాలను అర్థం చేసుకొంటే అన్ని వర్గాల ప్రజలు సామరస్య భావనతో ముందుకు వెళ్తారు. 

సమసమాజ స్థాపన కోసం తపించిన ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా హృదయపూర్వక అంజలి ఘటిస్తున్నాను. జనసేన పార్టీ సిద్ధాంతాలపైనా… పోరాట పంథాపైనా శ్రీ రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలు, ఆలోచన ప్రభావం ఉంది. ఎలుగెత్తు… ఎదిరించు.. ఎన్నుకో… అనే జనసేన పోరాట విధానానికి శ్రీ రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలే స్ఫూర్తి. కులాలను కలిపే ఆలోచనా విధానం అనేది జనసేన సిద్ధాంతాల్లో ఒకటి. 

శ్రీ లోహియా గారు చెప్పిన విధంగా కులాల మధ్య అంతరాలు తగ్గించడం వర్తమాన సమాజానికి ఎంతో శ్రేయస్కరం. ఆంధ్రప్రదేశ్ కుల వ్యవస్థపై శ్రీ లోహియా గారికి(Pawan Kalyan Lohiya)  సాధికారత ఉంది.  ఆయన ఇక్కడి కుల విధానాలు గురించి చెబుతూ రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కులాలు ఏ విధంగా ముందుకు వెళ్లాలో ‘ది క్యాస్ట్ ఇన్ ఇండియా’ పుస్తకంలో వివరించారు. 

కేవలం కుల వ్యవస్థపైనే కాదు మహిళా సాధికారతతో భారతీయ సమాజ వికాసం గురించి కూడా ఎంతో విపులంగా చెప్పారు. శ్రీ లోహియా గారు సిద్ధాంతాలు ప్రతిపాదించడమే కాదు వాటిని తన ప్రజా జీవితంలో ఆచరించి చూపారు. 

వర్తమాన సమాజం… ముఖ్యంగా యువత శ్రీ లోహియా గారి సిద్ధాంతాలు అర్థం చేసుకొంటే కులాల సంక్లిష్టత నుంచి బయటపడవచ్చు” అని పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా వేడిగా సందేశం ఇచ్చారు. 

కాగా .. ఇటీవల మార్చ్ 14 న 10 వ ఆవిర్భావ సభ చాల విజయోపేతంగా జరిగింది. అణగారిన వర్గాలను కలుపుకుంటూ కాపులను పెద్దన్న పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్న కులాలను తన పాత్ర పోషించాలని చెప్పారు.

Also Read : ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్ ఖాతాల్లోకి డబ్బులు

Leave A Reply

Your Email Id will not be published!