Pawan Kalyan: పొత్తు ధర్మంపై క్యాడర్ కు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
పొత్తు ధర్మంపై క్యాడర్ కు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: రాష్ట్ర సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. పొత్తు ధర్మాన్ని గౌరవిస్తున్నందుకు జనసేన నేతలు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూటమికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వార్థ బుద్ధితో వ్యవహరిస్తే కఠిన చర్యలకు వెనకాడబోమని… అలా మాట్లాడేవారిపై ఎప్పటికప్పుడు సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. పొత్తు ధర్మాన్ని పాటిద్దాం… మిత్ర పక్ష కూటమిని గెలిపిద్దాం అని పవన్ జనసేన నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పొత్తులో భాగంగా జనసేన చేసిన త్యాగాలు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి చేసినవని ఆయన స్పష్టం చేసారు.
Pawan Kalyan Order..
బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశ్యించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…ఎక్కడా పొరపాట్లకు, లోటుపాట్లకు తావివ్వకుండా మూడు పార్టీలూ క్షేత్ర స్థాయిలో ప్రజలను కలుసుకుని… వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగాలని కోరారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధమయ్యారని వివరించారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ కమిటీల్లో ఉన్న వీర మహిళలకు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నియామక పత్రాలు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… “రాజకీయంగా వీర మహిళల ఎదుగుదలకు జనసేన పార్టీ ప్రాధాన్యమిస్తుంది. వీర మహిళలు పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచారు. ప్రజా పోరాటాల్లోనూ ముందు వరుసలో నిలబడ్డారు. పార్టీ కోసం నిలబడిన వీర మహిళలను పార్టీ మర్చిపోదు. కులం, మతం, ప్రాంతాలు దాటి మహిళా నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపర్చే బాధ్యత తీసుకుంటాను. పార్టీకి, పాలనకు వారధిగా నిలిచేలా వారి సేవలు ఉపయోగించుకుంటాం. అపజయంలోనూ వెనక్కి తగ్గకుండా గత అయిదేళ్లుగా వీర మహిళలు పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన తీరు గొప్పది. మీ మద్దతు ఇలాగే కొనసాగించాలి. కూటమి అభ్యర్ధుల విజయానికి పూర్తి స్థాయిలో పని చేయాలి” అని పవన్ పిలుపునిచ్చారు.
Also Read : Harishrao: జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో హరీశ్‌రావు మాజీ పీఏ !