YSR Pension Kanuka: పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు !

పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు !

YSR Pension Kanuka: సార్వత్రిక ఎన్నికల నగారా మ్రోగడంతో దేశ వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోనికి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారాలపై ఎన్నికల కమీషన్ డేగ కన్ను వేసింది. ప్రభుత్వం నుండి వేతనం లేదా గౌరవ వేతనం తీసుకుని పార్టీ ప్రచారాల్లో పాల్గొనే ఉద్యోగులపై కొరడా ఝులిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న గ్రామ వార్డు వాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఎన్నిలక కమీషన్(EC) ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు తన ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌, మే నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) కీలకమైన సర్క్యులర్‌ జారీ చేసింది.

YSR Pension Kanuka Update

ఎన్నికల కోడ్‌ దృష్ట్యా బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది… వాలంటీర్ల వద్ద ఆథరైజేషన్‌ పత్రం తప్పనిసరిగా తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శి… సంక్షేమ కార్యదర్శులకు (గ్రామ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్) ఆథరైజేషన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. పింఛను పంపిణీ సమయంలో వాలంటీర్లు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు ఫించను పంపిణీ చేసినట్టుగా ఫొటోలు, వీడియోలు తీయవద్దని సెర్ప్‌ తేల్చి చెప్పింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినట్టు తేలితే చర్యలు తీవ్రంగా ఉంటాయని సెర్ప్ సీఈవో కార్యాలయం స్పష్టం చేసింది.

Also Read : Pawan Kalyan: పొత్తు ధర్మంపై క్యాడర్ కు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

Leave A Reply

Your Email Id will not be published!