Election Commission of India: ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీకి ఈసీ నోటీసులు !

ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీకి ఈసీ నోటీసులు !

Election Commission of India: లోక్‌సభ ఎన్నికల వేళ విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. బీజేపీ, కాంగ్రెస్‌ పరస్పర ఫిర్యాదులపై విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీలకు గురువారం నోటీసులు జారీ చేసింది. దీనితో ఈసీ నోటీసులు ఇరు పార్టీల్లో కలకలం రేపుతున్నాయి. ఒకవైపు సాక్ష్యాత్తూ ప్రధాని మంత్రి, మరోవైపు కూటమి అధికారంలోనికి వస్తే ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్న కాంగ్రెస్ అగ్రనేతకు కూడా ఈసీ నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

Election Commission of India Notices

ఎన్నికల కోడ్‌ను మోదీ, రాహుల్‌ ఉల్లంఘించినందుకు ఈ నోటీసులు ఇచ్చినట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్‌ 29, ఉదయం 11 గంటల లోపు ఇరువురు నేతలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తూ చేసిన ప్రసంగాలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఇద్దరు నేతలు తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్వేషపూరిత ఆరోపణలు, విమర్శలు చేస్తూ ప్రసంగించారు. ఈ వ్యవహారంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ చీఫ్‌ను ఈసీ వివరణ కోరింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించకుండా పార్టీ అధ్యక్షులే జాగ్రత్త వహించాలని పేర్కొంది.

Also Read : Uddhav Thackeray: శివసేన మేనిఫెస్టో విడుదల చేసిన ఉద్ధవ్‌ ఠాక్రే !

Leave A Reply

Your Email Id will not be published!