CM YS Jagan: ఈ నెల 28 నుండి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు ! షెడ్యూల్‌ ఇదే !

ఈ నెల 28 నుండి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు ! షెడ్యూల్‌ ఇదే !

CM YS Jagan: ఏపీలో నామినేషన్ల స్వీకరణ ముగియడంతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు అధికార వైసీపీ సిద్ధమౌతోంది. దీనితో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 22 రోజుల పాటు 23 జిల్లాలు 86 నియోజకవర్గాల్లో చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రను బుధవారంతో ముగించారు. గురువారం పులివెందుల లో నామినేషన్ వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో జైత్ర యాత్రకు సిద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28 నుండి రోజుకు మూడు చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది.

CM YS Jagan Comment

ఈ నెల 28న తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించనున్నారు. ప్రతిరోజూ మూడు బహిరంగ సభల్లో సీఎం పాల్గొననున్నారు. 28న ఉదయం తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండేపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకారావుపేట, ఏలూరులో జరిగే సభలకు సీఎం జగన్‌ హాజరుకానున్నారు.

మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్‌
►28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు
►29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు
►30న కొండెపి, మైదుకూరు, పీలేరు
►మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు

Also Read : Election Commission of India: ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీకి ఈసీ నోటీసులు !

Leave A Reply

Your Email Id will not be published!