Sunetra Pawar: రూ. 25 వేల కోట్ల స్కామ్‌ కేసులో సునేత్ర పవార్‌కు క్లీన్‌ చిట్‌ !

రూ. 25 వేల కోట్ల స్కామ్‌ కేసులో సునేత్ర పవార్‌కు క్లీన్‌ చిట్‌ !

Sunetra Pawar: లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ. 25 వేల కోట్ల విలువైన కోఆపరేటివ్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్‌ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు పోలీసులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ప్రస్తుతం సునేత్ర పవార్ కు ఇచ్చిన ఈ క్లీన్ చిట్ మహారాష్ట్రతో పాటు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో పవార్ కుటుంబంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు… పవార్ కుటుంబం బీజేపీలో చేరిన వెంటనే క్లీన్ చిట్ వచ్చిన విషయాన్ని ఊటంకిస్తూ విపక్షాలు మరోసారి బీజేపీపై వాషింగ్ పౌడర్ ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

Sunetra Pawar Case Updates

మహారాష్ట్ర స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులో జరిగిన స్కామ్‌కు సంబంధించిన కేసులో ముంబయి పోలీసు ఆర్థికనేరాల విభాగం దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది జనవరిలోనే ముంబయి పోలీసులు క్లోజర్‌ రిపోర్ట్‌ దాఖలు చేశారు. అయితే అందులోని వివరాలు తాజాగా బయటికొచ్చాయి. ఇందులో సునేత్ర పవార్‌(Sunetra Pawar), ఆమె భర్త అజిత్‌కు సంబంధించిన లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తాము గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అజిత్‌ కు చెందిన జరందేశ్వర్‌ షుగల్‌ మిల్‌కు జారీ చేసిన రుణాల విషయంలో బ్యాంకుకు ఎలాంటి నష్టం జరగలేదని నివేదికలో తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల వేళ ఈ నివేదిక బయటికి రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ పైనా విపక్షాలు భగ్గుమన్నాయి. ‘‘ఈ కుంభకోణం గురించి గతంలో మోదీ మాట్లాడుతూ పవార్‌ కుటుంబం మొత్తం అవినీతిపరులని ఆరోపించారు. ఇప్పుడు వారు పార్టీ మారగానే పోలీసులు సునేత్ర పవార్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. అంటే బీజేపీపై వాషింగ్‌ పౌడర్‌ వ్యాఖ్యలు నిజమేనని మరోసారి రుజువైంది’’ అని శివసేన యూబీటీ నేత ఆనంద్‌ దూబే ఆరోపించారు.

తాజా ఎన్నికల్లో సునేత్ర పవార్‌ ఎన్డీయే తరఫున బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. శరద్‌ పవార్‌ కంచుకోట అయిన ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ఆయన కుమార్తె సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లోనూ ఆమె మరోసారి బరిలోకి దిగుతున్నారు. దీనితో బారామతిలో ఈ వదినా మరదళ్ల సవాల్‌ దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

Also Read : Supreme Court of India: ‘వీవీప్యాట్‌’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!