Pawan Kalyan : లెజీనోవాతో పవన్ ఇటలీకి
సోషల్ మీడియాలో వైరల్
Pawan Kalyan : హైదరాబాద్ – ప్రముఖ నటుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆయన సమావేశాలు, సినిమాలలో ఇప్పటి వరకు బిజీగా మారారు. తాజాగా వాటికి పుల్ స్టాప్ పెట్టారు పవన్ కళ్యాణ్. దీనికి ప్రధాన కారణం మెగా ఫ్యామిలీకి చెందిన నటుడు వరుణ్ తేజ్ , నటి లావణ్య త్రిపాఠీలు ఒక్కటి కాబోతున్నారు.
Pawan Kalyan Photo Viral with His Wife
వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది ఇటలీలో. అందరూ భారత్ లో చేసుకుంటే ఈ ఇద్దరు వెరైటీగా అందమైన ఇటలీకి మార్చేశారు. ఇప్పటికే ఈ జంట అక్కడ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ వచ్చింది. ఇదే సమయంలో డిఫరెంట్ గా వివాహ వేడుకకు సంబంధించి పెళ్లి కార్డు , ఆహ్వానాన్ని వీడియో రూపంలో షేర్ చేశారు.
వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లికి గాను కేవలం మెగా కుటుంబీకులు , మరికొందరు ఎంపిక చేసిన నటీనటులు, తెలిసిన వారికి మాత్రమే ఇన్విటేషన్ పంపినట్లు సమాచారం. దీంతో ఇవాళ సదరు మ్యారేజ్ కు హాజరయ్యేందుకు గాను మెగా కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రెడీ అయ్యారు.
తన మూడో భార్య అన్నా లెజీనోవాతో కలిసి కంట పడ్డారు. ఆమెతో కలిసి ఇటలీకి బయలు దేరారు. నవంబర్ 1న వరుణ్ లావణ్య పెళ్లి జరగనుంది. ఇదిలా ఉండగా మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చినట్లు ఆ మధ్యన ప్రచారం జరిగింది పవన్ పై. దీనికి చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ దర్శనం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read : Vishnu Vardhan Reddy Azharuddin : కాంగ్రెస్ పై ధిక్కార స్వరం