Payyavula Keshav : బాబును చూస్తే జాలేస్తోంది
పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్
Payyavula Keshav : రాజమండ్రి – ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఊచలు లెక్క బెడుతున్న తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
Payyavula Keshav Words
ఈ సందర్బంగా ఇద్దరి మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చాయి. బాబుతో భేటీ అనంతరం పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. సుదీర్గ రాజకీయ అనుభవం కలిగిన అరుదైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు.
కానీ సింహం లాంటి ఆయనను జైలులో చూడగానే తనకు చాలా బాధ కలిగిందన్నారు. కానీ ఆయనతో మాట్లాడిన తర్వాత ఇక ఈయన మారడు అనిపించిందని స్పష్టం చేశారు పయ్యావుల కేశవ్(Payyavula Keshav). ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ స్కాం కేసులో ప్రధాన సూత్రధారిగా ఏపీ సీఐడీ పేర్కొంది.
ఈ మేరకు నంద్యాలలో ఉన్న చంద్రబాబును ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి విజయ వాడ కోర్టులో హాజరు పర్చింది. విచారణ అనంతరం ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది జడ్జి. చంద్రబాబుకు రిమాండ్ విధించింది. ఈనెల 19 వరకు ఆయన జైలులోనే ఉండ బోతున్నారు.
Also Read : Revanth Reddy : మెట్రో అధికారులపై రేవంత్ గుస్సా
