PBKS vs DC IPL 2023 : ఢిల్లీ గెలిచేనా పరువు దక్కేనా
జోరు మీదున్న పంజాబ్ కింగ్స్
PBKS vs DC IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఇది 64వ మ్యాచ్. ప్లే ఆఫ్ కు ఎవరు చేరుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పంజాబ్ కింగ్స్ ఇప్పటి దాకా 12 మ్యాచ్ లు ఆడింది. 6 మ్యాచ్ లలో గెలుపొందగా 6 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్ లు ఆడింది. 4 మ్యాచ్ లలో విజయం సాధించి 8 మ్యాచ్ లలో పరాజయం పాలైంది.
రిషబ్ పంత్ గాయపడడంతో ఆసిస్ స్టార్ డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కు సారథ్యం వహిస్తున్నాడు. వ్యక్తిగతంగా అద్భుతంగా రాణించినా జట్టు పరంగా ఆశించిన మేర ప్రదర్శన చేపట్టలేక పోయింది. గతంలో కంటే ఈసారి ప్లే ఆప్ రేసుకు ఎవరు చేరుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 18 పాయింట్లో పాండ్యా సేన టాప్ లో నిలిచింది.
ఇక లక్నో, ముంబై, చెన్నై మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. ఇక 4వ స్థానం కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ పోటీ పడుతున్నాయి. ఇక ఈ లీగ్ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ప్లే ఆఫ్ రేసు నుంచి సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే నిష్క్రమించాయి. కనీసం ఈ మ్యాచ్ అయినా గెలుపొంది పరువు దక్కించు కోవాలని ఆశిస్తుస్తున్నారు ఢిల్లీ ఫ్యాన్స్.
Also Read : Tim David
