PBKS vs MI IPL 2023 : ముంబై గెలిచేనా పంజాబ్ నిలిచేనా
జోరు మీదున్న రోహిత్..శిఖర్ సేన
PBKS vs MI IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో బుధవారం రాత్రి 7.30 గంటలకు రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ , శిఖర్ ధావన్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ లు(PBKS vs MI IPL 2023) తలపడనున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ 46వది. ఇరు జట్లు అత్యంత బలంగా ఉన్నాయి.
చెన్నై లోని చెపాక్ స్టేడియంలో మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ సేనను మట్టి కరిపించింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్. ఇక ముంబై వాంఖడే స్టేడియంలో ఊహించని రీతిలో బలమైన రాజస్థాన్ రాయల్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది రోహిత్ సేన. ఒకానొక దశలో ఓడి పోతుందని అనుకున్న ముంబై ఇండియన్స్ అసాధారణ విజయం వరించింది. చివరి దాకా ఉత్కంఠ భరిత పోరు సాగింది. ఆఖరి ఓవర్ లో 17 రన్స్ కావాల్సి ఉండగా ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే గెలుపు సాధించింది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ చేసిన భారీ స్కోర్ ను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఛేదించింది. దీంతో ప్రస్తుతం జరగబోయే కీలక లీగ్ పోరులో ముంబై ఇండియన్స్ , పంజాబ్ కింగ్స్ విజయం కోసం శ్రమించడం ఖాయం. బుధవారం రాత్రి మొహాలీలోని బింద్రా స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. స్వంత మైదానంలో పంజాబ్ జోరుకు ముంబై బ్రేక్ వేస్తుందా అన్నది వేచి చూడాలి.
Also Read : బిగ్ ఫైట్ లో బాద్ షా ఎవరో