PBKS vs RR IPL 2023 : ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విక్టరీ
4 వికెట్ల తేడాతో ఘన విజయం
PBKS vs RR IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో ఆరంభంలో అదుర్స్ అనిపించిన రాజస్థాన్ రాయల్స్(RR) చివరకు ఇతర జట్ల గెలుపు ఓటములపై ఆధారపడింది. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ చివరి దాకా ఉత్కంఠ భరితంగా సాగింది. విజయం ఊరించింది. ఎవరు గెలుస్తారో తెలియక ఫ్యాన్స్ తల్లడిల్లి పోయారు. ఈ లీగ్ లో ఈ మ్యాచ్ గుర్తుండి పోతుంది. చివరి ఓవర్ లో ధ్రువెల్ హీరోగా మారాడు రాజస్థాన్ రాయల్స్ ను గెలిపించాడు.
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్(RR) రాజసాన్ని ప్రదర్శించింది. ఎట్టకేలకు గెలుపు నమోదు చేసింది. దీంతో లీగ్ పరంగా 14 మ్యాచ్ లను ఆడింది. 7 మ్యాచ్ లలో గెలుపొంది 7 మ్యాచ్ లలో పరాజయం పాలైంది. 188 పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించేందుక నానా తంటాలు పడింది శాంసన్ సేన. మరోసారి యశస్వి జైస్వాల్ మెరిశాడు. తనదైన రీతిలో ఆడాడు. ఫోర్లతో రెచ్చి పోయాడు. ఇక ఊహించని రీతిలో దేవదత్ పడిక్కల్ తన ఆటకు భిన్నంగా దుమ్ము రేపాడు. పంజాబ్(PBKS) బౌలర్లను ఉతికి ఆరేశాడు. సరిగ్గా హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్ మ్యాచ్ ను తమ జట్టు వైపు తిప్పేశారు.
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్(PBKS) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 రన్స్ చేసింది. ఆరంభంలోనే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పంజాబ్ కు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు సామ్ కరన్ . 31 బాల్స్ ఆడి 4 ఫోర్లు 2 సిక్సర్లతో 49 రన్స్ చేశాడు. నాటౌట్ గా నిలిచాడు.
జితేశ్ శర్మ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. 28 బంతులు ఆడి 3 ఫోర్లు 3 సిక్సర్లతో 44 రన్స్ చేశాడు. అనంతరం షారుఖ్ ఖాన్ షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతులు ఆడి 4 ఫోర్లు 2 సిక్సర్లతో 41 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇక రాజస్థాన్ తరపున బరిలోకి దిగిన బట్లర్ మరోసారి నిరాశ పరిచాడు. కగిసో రబాడా బౌలింగ్ దెబ్బకు ఠారెత్తాడు. గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన పడిక్కల్ చుక్కలు చూపించాడు. జైశ్వాల్ 36 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లతో 50 రన్స్ చేశాడు. పడిక్కల్ 30 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 52 రన్స్ చేశాడు. హెట్మెయర్ 28 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 3 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 46 రన్స్ చేశాడు.
Also Read : Sonia Gandhi Comment