Rahul Gandhi Yatra : రాహుల్ యాత్రకు జనం బ్రహ్మరథం
తెలంగాణలో కొనసాగుతున్న యాత్ర
Rahul Gandhi Yatra : భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీకి అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఆయన ప్రారంభించిన యాత్ర 1200 కిలోమీటర్లను దాటింది. ఇవాళ 57వ రోజు బుధవారం కొనసాగుతోంది తెలంగాణలో. చార్మినార్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నెక్లస్ రోడ్డు వద్ద ప్రసంగించారు.
ఇప్పటి వరకు రాహుల్ గాంధీ యాత్ర(Rahul Gandhi Yatra) తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పూర్తయింది. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రాహుల్ గాంధీ యాత్రలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇప్పటి వరకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ తో పాటు నటులు పూనమ్ కౌర్ , పూజా భట్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
ఇక తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కళాకారులు అపూర్వమైన రీతిలో స్వాగతం పలికారు రాహుల్ గాంధీకి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈ యాత్ర కొనసాగనుంది. ఈనెల 7న మహారాష్ట్రలోకి ఎంట్రీ అవుతుంది. అప్పటి వరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు రాహుల్ గాంధీ.
మరో వైపు ప్రధాన మంత్రిని, బీజేపీని, దాని అనుబంధ సంస్థలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఆ ముగ్గురు బడా వ్యాపారవేత్తల కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పని చేస్తున్నారని 135 కోట్ల మంది ప్రజల కోసం కాదని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం రాహుల్ యాత్ర హాట్ టాపిక్ గా మారింది దేశంలో.
Also Read : రాహుల్ గాంధీ యాత్రలో పూజా భట్