విజయవాడ : టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నిర్వీర్యం చేశాడని ఆరోపించారు. అందుకే జనం ఛీ కొట్టారని, కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని అయినా బుద్ది రావడం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అటువంటి దారుణాలు ఎక్కడ జరిగాయో మీరు చూపించాలని అన్నారు. రోడ్లపైకి వచ్చి రౌడీ లాగా దాడులు చేస్తే అరెస్టులు చేయకూడదా? అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. ఉచ్చ నీచాలు మరచి మాట్లాడిన వారిపై కేసులు పెడితే అరాచకమా అని నిలదీశారు. నా తండ్రి సమకాలికుడు చంద్రబాబు అని ఈరోజు జగన్ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. ఇదేం సంస్కారం అని, బుద్ధి ముందు నుంచి ఉంటే జగన్మోహన్ రెడ్డి కి ఇంత ఘోర ఓటమి ఉండేది కాదన్నారు.
జగన్ అధికారంలో ఉండగా కొడాలి నాని, ద్వారంపూడి వంటి వారు చంద్రబాబుపై నోరు పారేసుకుంటే నువ్వేం చేసావ్ జగన్ అంటూ ఫైర్ అయ్యారు. వారిని నిరోధించాల్సిన జగన్ ముసి ముసిగా నవ్వుకుంటూ వాళ్లను ప్రోత్సహించారని ఆరోపించారు బుద్దా వెంకన్న. దేవత లాంటి భువనేశ్వరిని ఎన్ని మాటలు ఎప్పుడన్నారో ఆనాడే టిడిపికి ఓటు వేయాలని ప్రజల నిర్ణయించుకున్నారని అన్నారు. వాళ్లు నోరు పారేసుకున్న రోజే ఖండించి ఉంటే బాగుండేదన్నారు. భువనేశ్వరి అమ్మ కూడా నా తల్లి వయసు లాంటిది చెప్పాల్సి ఉందన్నారు. ఇప్పుడు మాత్రం చిలక పలుకులు పలుకుతున్న జగన్ కు ఆరోజు ఇటువంటి సంస్కారం ఎందుకు గుర్తు రాలేన్నారు.
