Period Leave Comment : ‘నెలసరి’లో సెలవు ఇస్తే తప్పేంటి
చట్టం తీసుకు రాక పోతే ఎలా
Period Leave Comment : దేశంలో సగానికి పైగా జనాభా ఉన్న మహిళలకు ఇంకా రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంలో చర్చ జరుగుతోంది. ఆకాశంలో సగమని అంటూనే అధః పాతాళానికి తొక్కేస్తోంది సమాజం.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్బంగా మహిళలకు సంబంధించి నెల నెలా వచ్చే నెలసరిపై చర్చ జరిగింది. దీనిపై వైసీపీ అమలాపురం ఎంపీ చింతా అనురాధ కీలక ప్రశ్నలు సంధించారు.
ఆమె చర్చకు తెర తీశారు. కోట్లాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ , అసంఘటిత రంగాలలో మహిళలు, యువతులు, బాలికలు పని చేస్తున్నారు. కానీ ప్రతి నెల నెలా వచ్చే రుతుస్రావం (నెలసరి లేదా మెన్సెస్ ) కు సంబంధించి ఎందుకు సెలవులు(Period Leave) ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
దీనిని ఓ హక్కుగా, చట్టంగా తీసుకు రావాలని ఎప్పటి నుంచో కోరుతూ వస్తున్నారు. కానీ కొలువుతీరిన పాలకులకు అవేవీ పట్టడం లేదు.
ఆ సమయంలో ఎంతో ఇబ్బందులకు గురవుతారని, వారి మానసిక, శారీరక స్థితి దారుణంగా ఉంటుందని, వారు పని చేసే మూడ్ లో కూడా ఉండరని మహిళా కౌన్సెలర్లు, వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
వారికి ప్రశాంతత అవసరమని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు మహిళా ఎంపీలు దీనిపై నిలదీశారు.
ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ చట్టంగా రూపు దిద్దుకునేంత దాకా ఇది అమలు కాదన్నది సత్యం.ఇప్పటికే వేలాది కంపెనీలు, సంస్థలు కొలువు తీరాయి దేశంలో. అన్ని రంగాలలో మహిళలు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
అటెండర్ స్థాయి నుంచి చైర్మన్ల దాకా కూలీల నుంచి కార్పొరేట్ పదవుల దాకా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మరికొన్ని చోట్ల ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి.
వేలాది మంది మహిళా హక్కుల కార్యకర్తలు నెలసరి సమయంలో సెలవులు తప్పక ఇవ్వాలని కోరుతున్నాయి. కానీ వారి నినాదాలు ఆక్రందనల వరకే పరిమితమై పోయాయి. కానీ ఆచరణకు నోచుకోవడం లేదు. దేశ రాష్ట్రపతి మహిళ ఉన్నారు. ఎన్నో చోట్ల కీలక పదవులు చేపట్టారు.
కానీ వారికి స్వేచ్ఛ లేకుండా పోయింది. కనీసం నెలసరి విషయంలోనైనా ప్రభుత్వాలు, పాలకులు మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్లు ఈ స్థాయిలో రావడానికి కారణం మహిళలేనని మరిచి పోతే ఎలా.
ఈ తరుణంలో ఆయా కంపెనీలు, సంస్థల యజమానులు, ప్రభుత్వ శాఖల్లోని బాధ్యులు మహిళలకు రుతుక్రమ సెలవులు(Period Leave) మంజూరు చేయడాన్ని తప్పనిసరి చేసే చట్టాన్ని ప్రవేశ పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇది యుద్ద ప్రాతిపదికన చేయాలి.
ఇదిలా ఉండగా కొన్ని సంస్థలు ఇప్పటికే సెలవులు ప్రకటించాయి. అందులో ఫుడ్ డెలివరీ సర్వీస్ లో పేరొందని జొమాటో పీరియడ్ లీవ్ విధానాన్ని ప్రవేశ పెట్టింది.
అంతర్జాతీయంగా ప్రశంసలు కూడా అందుకుంది. 2017లో కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ నినాంగ్ ఎరింగ్ రుతుస్రావం ప్రయోజనాల బిల్లును ప్రవేశ పెట్టారు.
కానీ అది ఇంత వరకు ఆచరణకు నోచుకోలేదు. చట్టంగా మార్పు చెందలేదు. ఏది ఏమైనా ఇప్పటికైనా బీజేపీ సర్కార్ మహిళలకు నెలసరి సెలవు మంజూరు చేసేలా చట్టాన్ని తీసుకు రావాలని కోరుకుందాం.
Also Read : కంపెనీలలో మానవ హక్కుల ఉల్లంఘన