Perni Nani : కేంద్ర రూల్స్ మేరకే గ్రీన్ ట్యాక్స్ – నాని
స్పష్టం చేసిన మాజీ మంత్రి
Perni Nani : నిబంధనలకు విరుద్దంగా ఏపీ ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ విధిస్తోందంటూ వాహనదారులు ఆరోపించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు మాజీ మంత్రి పేర్ని నాని. మూడో విడత వారాహి పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలోని పెందుర్తిలో ఓ వాహన డ్రైవర్ జస సేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో వాపోయాడు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో గ్రీన్ ట్యాక్స్ చాలా తక్కువగా ఉందన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి వచ్చాక గ్రీన్ ట్యాక్స్ మోత మోగిస్తున్నాడని, దీంతో తాము వాహనాలను నడపడమే గగనంగా మారిందన్నారు.
Perni Nani Comments
దీనిపై పవన్ కళ్యాణ్ రెచ్చి పోయాడు. జగన్ రెడ్డిపై మండిపడ్డారు. గ్రీన్ ట్యాక్స్ పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆరోపించాడు. ఆపై ఏపీ సర్కార్ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిందని ఫైర్ అయ్యారు. దీంతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani). ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం పవన్ కళ్యాణ్ కు అలవాటుగా మారిందన్నారు. డ్రైవర్ కు విషయం తెలియక తనతో చెప్పాడని పేర్కొన్నారు.
తాము స్వంతంగా గ్రీన్ ట్యాక్స్ వసూలు చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన రూల్స్ ప్రకారమే ట్యాక్స్ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలలో ఇదే పద్దతి అమలవుతుందన్నారు. 7 నుంచి 10 ఏళ్ల మధ్య ఉన్న వాహనాలకు రూ. 4,000 , 10 నుంచి 12 ఏళ్లు పూర్తయిన వాహనాలకు రూ. 5,000, 12 ఏళ్లు దాటిన వాహనాలకు రూ. 6,000 వసూలు చేయాల్సి ఉంటుందన్నారు.
Also Read : EX Minister Chandrasekhar : బీజేపీకి షాక్ మాజీ మంత్రి గుడ్ బై