Jailer Collections : త‌మిళ నాట తలైవా హ‌వా

ర‌జ‌నీకాంత్ జైల‌ర్ సూప‌ర్

Jailer Collections : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ , త‌మ‌న్నా భాటియా క‌లిసి న‌టించిన జైల‌ర్ దుమ్ము రేపుతోంది. ఆగ‌స్టు 10న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుద‌లైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక త‌మిళ‌నాడులో గ‌తంలో ఉన్న రికార్డుల‌ను తిర‌గ రాసింది జైల‌ర్ మూవీ.

Jailer Collections Record

ఇప్ప‌టి వ‌ర‌కు భారీ ఎత్తున క‌లెక్ష‌న్స్(Jailer Collections) కొల్ల‌గొడుతోంది. మున్ముందు కూడా ఇదే స్థాయిలో వ‌సూళ్లు ఉంటాయ‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా ఈ చిత్రానికి హైలెట్ ర‌జ‌నీకాంత్ అని చెబుతున్నారు. త‌న ఎప్ప‌టి లాగే మేన‌రిజం ఈ సినిమాకు బ‌లంగా మారింది. ఇక అందాల ముద్దుగుమ్మ త‌మ‌న్నా భాటియా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది.

ఈ చిత్రానికి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ క‌న్న‌డ నాట టాప్ లో ఉన్న న‌టుడు శివ రాజ్ కుమార్, మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కూడా న‌టించ‌డం విశేషం. మొత్తంగా నెల్స‌న్ స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌మిళ‌నాడులో జైల‌ర్(Jailer) క‌లెక్ష‌న్స్ చూస్తే ఆశ్చ‌ర్య పోయేలా ఉన్నాయి. ఇప్ప‌టి దాకా కేవ‌లంల మూడు రోజుల్లోనే రూ. 76 కోట్లు సాధించ‌డం విశేషం.

తొలి రోజు రూ. 29.46 కోట్లు, 2వ రోజు రూ.20.25 కోట్లు, 3వ రోజు రూ. 26.38 కోట్లు వ‌సూలు చేసింది. మొత్తంగా రూ. 76.09 కోట్లు రావ‌డం విశేషం.

Also Read : Perni Nani : కేంద్ర రూల్స్ మేర‌కే గ్రీన్ ట్యాక్స్ – నాని

Leave A Reply

Your Email Id will not be published!