Phone Tapping Case : మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ డీఎస్పీ పై కూడా కేసు..

మాజీమంత్రి హరీష్‌రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది...

Phone Tapping : ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం మరోసారి సంచలనంగా మారుతోంది. తాజాగా మాజీ మంత్రి హరీష్‌రావుపై కేసు నమోదయ్యింది. తన ఫోన్‌ కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ ఓ రియల్ ఏస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై కేసు నమోదు అయ్యింది.

Phone Tapping Case…

మాజీమంత్రి హరీష్‌రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్‌‌గౌడ్ అనే రియల్ ఏస్టేట్ వ్యాపారి ఈ ఫిర్యాదు చేశారు. గతంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా తన ఫోన్‌ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు చక్రధర్‌‌గౌడ్. ఆయన ఫిర్యాదు మేరకు హరీష్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అధికారులు. సెక్షన్ 120 (b), 386, 409, ఐటీ యాక్ట్ 2008 కింద కేసులు నమోదు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

Also Read : TG High Court : ములుగు ఎన్కౌంటర్ కేసుపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Leave A Reply

Your Email Id will not be published!