Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల ఎదుట హాజరుకానున్న నకిరేకల్ ఎమ్మెల్యే
మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలుయ బొల్లం మల్లయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు..
Phone Tapping : ఫోన్ టాపింగ్ కేసులో బిగ్ ట్వీస్టు నెలకొంది. మునుగోడు ఉపఎన్నిక సమయంలో బీఆర్ఎస్ నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Chirumarthi Lingaiah) రెండు నంబర్లు ట్యాప్ చేయించారు. ఇద్దరి ప్రైవేట్ వ్యక్తుల ట్యాప్ చేయాలని తిరుపతన్న, భుజంగరావులకు లింగయ్య నెంబర్లు పంపారు. ప్రస్తుత నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులుగా ఉన్న మధన్ రెడ్డి, రాజ్ కుమార్ ఉన్నారు. ఈ ఇద్దరి ఫోన్‌లు ట్యాప్ చేసినట్టు ఎయిర్టెల్ నుండి రిపోర్ట్ వచ్చింది. ఈ వ్యవహారంలో నే గురువారం లింగయ్యను పోలీసులు విచరించనున్నారు. మరోవైపు మధన్ రెడ్డి, రాజ్ కుమార్‌ను సైతం ఈరోజు విచారణకు పోలీసులు రమ్మన్నారు.
Phone Tapping Case Updates
ఫోన్ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Chirumarthi Lingaiah) గురువారం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలుయ బొల్లం మల్లయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫాన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా రాజాకీయ నేతలను పోలీసులు విచారించనున్నారు. చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మల్లయ్య, శేఖర్ రెడ్డిలను విచారణ చేసే అవకాశముంది. ఇది రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. లింగయ్య విచారణ తర్వాత మరో మాజీ మంత్రికి నోటిసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఫోన్ట్యాపింగ్ కేసులో పొలిటికల్ లింక్‌లు బయట పడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో జరిగిన పరిణామాలపై ఆధారాలు బయటపడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో పోలీసుల ద్వారా అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థికి డబ్బులు పంపిణీ కార్యక్రమం జరిగింది. డబ్బుల తరలింపులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారు. తిరుపతన్న ఫోన్లో కీలక ఆధారాలు లభించాయి. ఈ ఆధారాలను బెస్ చేసుకుని బీఆర్ఎస్ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.
కాగారాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసు విచారణలో అధికారులు సాంకేతిక ఆధారాలతో ముందుకెళ్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన నిందితుల సెల్‌ఫోన్లలో చెరిపేసిన సమాచారాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్ఎల్) నిపుణులు తిరిగి (రిట్రీవ్) రాబట్టారు. అందులో కీలక సంభాషణలు బయటపడడంతో వాటి ఆధారంగా కేసు దర్యాప్తులో రెండో అంకాన్ని ప్రారంభించారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌రావు, అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, డీఎస్పీ ప్రణీత్‌రావు నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను పరిశీలించిన ఎఫ్‌ఎస్ఎల్ బృందం.. నిందితులు డిలీట్ చేసిన సమాచారంలో చాలా వరకు తిరిగి రాబట్టినట్లు తెలుస్తోంది. ఓ వైపు కాల్ డేటా రికార్డు (సీడీఆర్), మరోవైపు ఎఫ్‌ఎస్ఎల్ నివేదికతో అధికారులు కేసు దర్యాప్తులో ముందుకెళ్తున్నారు. ట్యాపింగ్ కేసులో పట్టుబడ్డ నలుగురు అధికారులు గత ప్రభుత్వంలోని కొందరు ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు పనిచేసినతీరుపై ఆధారాలు లభించినట్లు తెలిసింది.
Also Read : Malkajgiri MLA : వక్ఫ్ బోర్డు పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి