VVS Laxman : ఆటగాళ్లను ఎంపిక చేయడం కష్టం
సెలెక్టర్లకు కత్తి మీద సాము లాంటిదే
VVS Laxman : బెంగళూరు క్రికెట్ అకాడమీ డైరెక్టర్ , భారత వన్డే క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియాలోకి ఎంపిక కావాలంటే విపరీతమైన పోటీ నెలకొందన్నాడు. అంతే కాదు ఒక్కో స్థానానికి భారీగా పోటీ నెలకొందని పేర్కొన్నాడు.
ఊహించని రీతిలో ప్రతి ఒక్కరూ రాణిస్తున్నారని, అంచనాలకు మించి ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తున్నారని దీంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని సెలెక్టర్ల కమిటీపై కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.
ఇదే సమయంలో త్వరలో వరల్డ్ కప్ జరగనుంది. దీంతో జట్టును ఎంపిక చేయడం ఇబ్బందికరంగా మారనుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. లక్నోలో జరిగిన వన్డే మ్యాచ్ లో భారత జట్టు కేవలం 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) మీడియాతో మాట్లాడారు.
జరగబోయే వరల్డ్ కప్ లో ఎవరిని ఎంపిక చేయాలనేది చాలా క్లిష్టమైన అంశం. డైరెక్టర్ గా , కోచ్ గా తనకే తెలియడం లేదన్నారు . ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్)లో పెద్ద ఎత్తున యువ క్రికెటర్లు రాణిస్తున్నారని 14 లేదా 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేయాలంటే పరిగణలోకి ఏకంగా 50 మంది యువ ఆటగాళ్లు లైన్ లో ఉన్నారని పేర్కొన్నాడు.
ఈ సమయంలో ఎవరిని ఎంపిక చేయాలనేది సెలక్టర్లకు చాలా కష్టమైన విషయమని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా వీవీఎస్ లక్ష్మణ్ చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేపాయి.
Also Read : శాంసన్ ఆటతీరు సింప్లీ సూపర్