Tejashwi Yadav : బీహార్ పై మాట్లాడే హ‌క్కు పీకేకు లేదు

ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్ కామెంట్

Tejashwi Yadav : బీహార్ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హ‌క్కు ఇండియ‌న్ పొటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ కు లేద‌ని రాష్ట్రీయ జ‌న‌తా దళ్ (ఆర్జేడీ) నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్(Tejashwi Yadav) స్ప‌ష్టం చేశారు.

బీహార్ లో గ‌త 30 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌లేదంటూ పీకే మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ , ప్ర‌స్తుత సీఎం నితీశ్ కుమార్ ల పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. పీకే కామెంట్స్ పై తేజస్వి యాద‌వ్ ఆదివారం స్పందించారు.

రాజ‌కీయ పార్టీల‌తో బేర‌సారాలు సాగించే ప్ర‌శాంత్ కిషోర్ ఎలా ప్ర‌శ్నిస్తారంటూ ప్ర‌శ్నించారు. పీకే బీహార్ అభివ‌ద్ధిపై చేసిన ఆరోప‌ణ‌ల‌లో వాస్త‌వం లేద‌ని, పూర్తిగా నిరాధార‌మ‌ని పేర్కొన్నారు.

ఇన్నాళ్లు ఆయ‌న ఎక్క‌డున్నారో తెలియ‌దు. ఈరోజు వ‌ర‌కు బీహార్ రాష్ట్ర ప్ర‌గ‌తిలో ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు పోషించిన దాఖ‌లాలు క‌నిపించ లేద‌న్నారు. ఆధారాలు లేకుండా ఎదుటి వాళ్ల‌పై రాళ్లు వేయ‌డం మానుకోవాల‌ని సూచించారు.

ఈరోజు వ‌ర‌కు బీహార్ కు ఆయ‌న ఏం చేశారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు తేజ‌స్వి యాద‌వ్. ఇదిలా ఉండ‌గా ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

అక్టోబ‌ర్ 2 నుంచి చంపార‌న్ వేదిక‌గా గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా 3,000 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు తేజస్వి యాద‌వ్(Tejashwi Yadav).

దేశంలో పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం అమ‌లుపై సీఎం మ‌ద్ద‌తు ఇచ్చార‌ని దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు న‌ష్టం త‌ప్ప లాభం లేద‌న్నారు. ఫ‌క్తు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే పీకే, నితీష్ కుమార్ నాట‌కాలు ఆడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు తేజ‌స్వి యాద‌వ్(Tejashwi Yadav).

 

Also Read : కాంగ్రెస్ ను వీడ‌నున్న మాజీ సీఎం ?

Leave A Reply

Your Email Id will not be published!