SCB BCCI : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రూల్స్ చాలా కచ్చితంగా ఉంటాయి. ఇందులో అనుమానం అక్కర్లేదు. ఇప్పటికే నిర్దేశించిన షెడ్యూల్స్ ప్రకారం మూడు ఫార్మాట్ లకు సంబంధించి ప్రపంచంలోని క్రికెట్ ఆడే దేశాలన్నీ ఫాలో కావాల్సి ఉంటుంది.
కానీ గత రెండేళ్లుగా ప్రపంచ క్రికెట్ లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకించి కరోనా మహమ్మారి దెబ్బకు ఖరారైన క్రికెట్ షెడ్యూల్స్ అన్నీ పద్దతి ప్రకారం కొనసాగడం లేదు.
కొన్ని అర్ధాంతరంగా రద్దవుతున్నాయి. దీంతో కార్పొరేట్ కంపెనీలన్నీ తలపట్టుకు కూర్చుంటున్నాయి. నిన్నటి దాకా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంక క్రికెట్ బోర్డు భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు – బీసీసీఐ(SCB BCCI )పుణ్యమా అని గల్లా పెట్టె పూర్తిగా నిండి పోవడం విశేషం.
ఎందుకంటే ద్రవిడ్ కోచ్ గా భారత – ఏ టీం లంక టూర్ పర్యటించింది. దీంతో స్పాన్సర్లు పెరగడం, ప్రకటనలు పెద్ద ఎత్తున రావడంతో ఆ దేశ బోర్డు ఫుల్ ఖుషీగా ఉంది.
ఇక తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు ఇవాళ సమావేశమైంది. ధనుష షనుకను ఆస్ట్రేలియాలో వచ్చే నెల ఫిబ్రవరి 11 నుంచి 20 దాకా జరిగే 5 మ్యాచ్ ల టీ20 సీరీస్ కు స్కిప్పర్ గా నియమించింది.
ఇదే సమయంలో అదే నెల 25న భారత్ లో లంక టీం పర్యటించాల్సి ఉంది. ఇందులో భాగంగా రెండు టెస్టులు, 3 టీ20 మ్యాచ్ లు ఆడనుంది.
ఇందులో భాగంగా మొదట టీ20 మ్యాచ్ లు నిర్వహించి ఆ తర్వాత టెస్టులు జరపాలంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు బీసీసీఐకి సుదీర్ఘ లేఖ రాసింది. దీనిపై బీసీసీఐ చీఫ్ దాదా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Also Read : జడేజా అద్భుతమైన క్రికెటర్