Kiren Rijiju Modi : త‌ప్పించారా లేక త‌ప్పుకున్నారా

కిరెన్ రిజిజుకు ఊహించ‌ని షాక్

Kiren Rijiju Modi : మోదీ కేంద్ర కేబినెట్ లో కీల‌కమైన మంత్రిగా ఉన్న కిరెన్ రిజిజుకు బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న‌ను న్యాయ శాఖ నుంచి త‌ప్పించారు. ఎలాంటి ప్రాధాన్య‌త శాఖ‌ను కేటాయించారు. త్వ‌ర‌లో దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో ముఖ్య భూమిక పోషిస్తూ వ‌చ్చిన రిజిజును ఎందుకు త‌ప్పించార‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

న్యాయ మంత్రిగా ఆయ‌న త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చారు. ఒక్కోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక కిరెన్ రిజిజు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ నుండి మూడు సార్లు లోక్ స‌భ ఎంపీగా ఉన్నారు. ర‌వి శంక‌ర్ ప్ర‌సాద్ నిష్క్ర‌మ‌ణ త‌ర్వాత జూలై 7, 2021న న్యాయ శాఖ మంత్రిగా కొలువు తీరారు. అంత‌కు ఆయ‌న క్రీడా శాఖ‌ను నిర్వ‌హించారు.

త‌న స్వ‌ల్ప ప‌ద‌వీ కాలంలో న్యాయ వ్య‌వ‌స్థ‌లో కీల‌క మార్పులు తీసుకు రావాల‌ని ప్ర‌య‌త్నం చేశారు. కొలీజియం వ్య‌వ‌స్థ‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారారు. త‌న ప‌రిధి దాటి మాట్లాడితే అది చ‌ట్టం ఎంత మాత్రం స‌హించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు కిరెన్ రిజిజు.

త‌న‌ను న్యాయ శాఖ మంత్రిగా తొలగించిన వెంట‌నే ట్వీట్ చేశారు. ఈ మేర‌కు సీజేఐ చంద్ర‌చూడ్ తో పాటు న్యాయమూర్తులంద‌రికీ భారీ మ‌ద్ద‌తు ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆయ‌న‌కు భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ‌కు మార్చారు. ఇది ప్రాధాన్య‌త పోస్టు కాదు. ఇదిలా ఉండగా కొలీజియం వ్య‌వ‌స్థ‌లో ప్ర‌భుత్వ నామినీల‌ను కూడా చేర్చాల‌ని సీజేఐకి లేఖ రాశారు.

Also Read : Supreme Court Jallikattu

Leave A Reply

Your Email Id will not be published!