PM Modi Congrats : యువతకు నిత్య స్పూర్తి ప్రజ్ఞానంద
ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ
PM Modi Congrats : ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ప్రశంసలు కురిపించారు. వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ లో రన్నర్ అప్ గా నిలిచిన తమిళనాడు లోని చెన్నైకి చెందిన ప్రజ్ఞానంద , తన తల్లిదండ్రులతో కలిసి మోదీని మర్యాద పూర్వకంగా కలిశారు.
PM Modi Congrats to Praggnanandhaa
ఈ సందర్బంగా ప్రత్యేకంగా ప్రధాని ప్రజ్ఞానందను అభినందించారు. నువ్వు ఫైనల్ లో ఓడి పోవచ్చు. రన్నర్ అప్ గా నిలిచి ఉండవచ్చు. కానీ భారత దేశంలోని కోట్లాది యువతీ యువకులకు స్పూర్తి దాయకంగా నిలిచావని ప్రశంసించారు.
ఏదో ఒక రోజు ప్రపంచ ఛాంపియన్ గా నిలుస్తావని, ఆ నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi). ఛాంపియన్ షిప్ సందర్బంగా బహూకరించిన పతకాన్ని ఈ సందర్భంగా ప్రజ్ఞానంద మోదీకి చూపించారు. ఆయన దానిని తాకి సంతోషానికి లోనయ్యారు.
కేంద్ర ప్రభుత్వం ఔత్సాహిక క్రీడాకారులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తన నైపుణ్యంతో భారత దేశానికి ప్రపంచ వ్యాప్తంగా పేరు తీసుకు వచ్చేలా చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ప్రజ్ఞానందకు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీని కలవడంతో తన జన్మ ధన్యమైందన్నారు ప్రజ్ఞానంద.
Also Read : CM Hemant Soren : మోదీపై యుద్దానికి రెడీ